Malala Yousafzai : వివాహబంధంలోకి మలాల

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత...మలాల యూసఫ్ జాయ్.. వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్...గల తన నివాసంలో...కుటుంబసభ్యుల సమక్షంలో నిఖా జరిగింది.

Malala

Malala Yousafzai Married : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత…మలాల యూసఫ్ జాయ్.. వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్…గల తన నివాసంలో…కుటుంబసభ్యుల సమక్షంలో నిఖా జరిగింది. వివాహానికి సంబంధించిన విషయాన్ని స్వయంగా..మలాల ప్రకటించారు. 24 ఏళ్ల మలాల..తన భాగస్వామి అస్సర్ తో కలిసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైందిగా వెల్లడించారు. అస్సర్..నేను జీవిత భాగస్వాములమయ్యాయమని, బర్మింగ్ హోమ్ లోని తమింట్లో…ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించడం జరిగిందని ..మీ ఆశీస్సులు తమకు పంపించాలని కోరారు. భార్య భర్తలుగా కొత్త ప్రయాణం…కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నామన్నారు.

Read More : Woman Arrest : ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో మహిళ అరెస్టు

ఇక మలాల విషయానికి వస్తే..ఈమె…పాక్ లోని స్వాత్ లోయలో జన్మించారు. బాలికల విద్య కోసం…ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలపై గళాన్ని వినిపించారు. 2012లో తాలిబన్లు…పాఠశాల బస్సులోకి చొరబడిన ఉగ్రమూకలు…ఆమెపై కాల్పులకు దిగారు. ఎడమ కణితిపై…శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో…పెషావర్ కు తరలించి..చికిత్స అందించారు. బుల్లెట్ గాయాలకారణంగా..ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్ కు తరలించారు. అక్కడనే తల్లిదండ్రులతో కలిసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు మలాల. అప్పటి నుంచి బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. విద్య కోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందించింది. 2020 ఆక్స్ ఫర్డ్…యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ…పాలిటిక్స్…ఎకనామిక్స్…లో డిగ్రీ పట్టా అందుకున్నారు మలాల.