Mamata Banerjee: మరోసారి వెస్ట్ బెంగాల్ మమత చేతుల్లోకే..

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్‌ నౌ - సీ ఓటర్‌’ ఒపీనియన్‌ పోల్..

Mamata Banerjee: మరోసారి వెస్ట్ బెంగాల్ మమత చేతుల్లోకే..

Mamata Banerjee Survey Shows Tmc Will Won Again In West Bengal

Updated On : March 25, 2021 / 7:47 AM IST

Mamata Banerjee: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోసారి విజయ తీరాలకు చేరుతుందని ‘టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌’ ఒపీనియన్‌ పోల్‌ ఫలితాలు వెల్లడించింది. భాజపా గట్టి పోటీ ఇచ్చినా.. దీదీ ధాటికి తట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లు సాధించబోదని అభిప్రాయపడింది.

అసోంలో ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, పుదుచ్చేరిలో ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పింది. తమిళనాడులో అన్నాడీఎంకే – భాజపా కూటమికి పరాభవాన్ని మిగిలిస్తూ, డీఎంకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని వెల్లడించింది. కేరళలో వామపక్ష కూటమికి ఈ దఫా సీట్లు కాస్త తగ్గినప్పటికీ, అధికారాన్ని కాపాడుకుంటుందని తెలిసింది.

‘టైమ్స్‌ నౌ – సీ ఓటర్‌’ నిర్వహించిన రీసెంట్ ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం..
వెస్ట్ బెంగాల్‌లో భాజపా:
వెస్ట్ బెంగాల్‌లో భాజపా దూకుడును తట్టుకొని, తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ కు దక్కుతుందనేది అంచనా. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుండగా.. 2016లో రాష్ట్రంలో కేవలం మూడు సీట్లకు పరిమితమైన కమలదళం.. ఈసారి వందకు పైగా స్థానాలను గెల్చుకోనుంది.

అసోం: యూపీఏ గట్టి పోటీ ఇచ్చినా..
అసోంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాజోత్‌ కూటమి, ఎన్డీయే మధ్య హోరాహోరీ పోరు నడవనుంది. ఎన్డీయే స్వల్ప తేడాతో గట్టెక్కి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందట.

తమిళనాడు: డీఎంకే కూటమికి పట్టం
రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం గద్దె దిగనుంది. డీఎంకే-కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి అధికారాన్ని సొంతం చేసుకోనుంది. రాష్ట్రంపై పట్టు బిగించాలనే భాజపా ఆశ ఈ ఎన్నికల్లో నెరవేరే అవకాశం లేదు.

కేరళ: ఎల్‌డీఎఫ్‌ మళ్లీ..
రాష్ట్రంలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధికారాన్ని నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగినా.. అధికార పీఠానికి ఆ కూటమి కొద్దిదూరంలో నిలిచిపోనుంది.

పుదుచ్చేరి: ఎన్డీయేకు అధికారం
ఇక్కడ భాజపా, ఎన్నార్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీయే ఘన విజయం సాధించనుంది. కాంగ్రెస్‌-డీఎంకే కూటమి రెండో స్థానానికి పరిమితం కానుంది.