ఎగ్జిట్ పోల్స్ : బెంగాల్ మమతదే..అసోంలో బీజేపీనే..కేరళలో మళ్లీ లెఫ్ట్..పుదుచ్చేరి బీజేపీదే,తమిళనాడులో డీఎంకే క్లీన్ స్వీప్
బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది.

Mamata Banerjee To Retain Bengal Dmk Sweep In Tamil Nadu Exit Polls
Exit Polls బెంగాల్ లో తుది దశ పోలింగ్(8వ దశ)నేడు ముగిసింది. కేరళ,తమిళనాడు,పాండిచ్చేరి,అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్-6న ముగియగా,ఎనిమిది విడతల్లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నేటితో ముగిశాయి. దీంతో దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి గత నెల రోజులకుపైగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పటికీ.. బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. బెంగాల్‌ను హస్తగతం చేసుకునేందుకు అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్ లో మరోసారి మమత అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. తమిళనాడులో ఎం.కే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తెల్చేశాయి. ఇక కేరళలో మరోసారి లెఫ్ట్ కూటమే అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. అయితే,అసోంలో మాత్రం మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్(మొత్తం 294 స్థానాలు)
టీఎంసీ, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, బీజేపీ
ఏబీపీ- సీఓటర్ సర్వే : 152-164 14-25 109-121
ఎన్డీటీవీ సర్వే : 156 17 121
రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : 128-138 11-21 138-148
టైమ్స్ ఆఫ్ ఇండియా : 133 16 143
టౌమ్స్ నౌ-సీఓటర్ : 158 19 115
జన్ కీ బాత్ : 112 6 174
అసోం ఎగ్జిట్ పోల్స్( మొత్తం 126 స్థానాలు)
బీజేపీ కాంగ్రెస్
రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : 74-84 40-50
ఇండియా టుడే : 75-85 40-50
టుడేస్ చాణక్య : 61-79 47-65
ఆక్సిస్ మై ఇండియా : 75-85 40-50
ఆజ్ తక్ : 75-85 40-50
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్(మొత్తం 234స్థానాలు)
డీఎంకే-కాంగ్రెస్, ఏఐఏడీఎంకే-బీజేపీ, ఎంఎన్ఎం, ఏఎన్ఎంకే
రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : 160-170 58-68 0-2 4-6
టుడేస్ చాణక్య : 164-186 46-68 ఇతరులు: 0-6
కేరళ ఎగ్జిట్ పోల్స్ (మొత్తం 140 స్థానాలు)
ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ
టైమ్స్ ఆఫ్ ఇండియా : 76 61 3
ఇండియా టుడే : 104-120 20-36 0-2
ఆక్సిస్ మై ఇండియా : 104-120 20-36 0-2
పోల్ డైరీ : 77-87 51-61 2-3
పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్(మొత్తం 30)
రిపబ్లిక్ సీఎన్ఎక్స్ : కాంగ్రెస్ బీజేపీ
11-13 16-20