Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Mamata Banerjee

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ముగ్గురు హిందూ సన్యాసులను అరెస్టు చేశారు.

బంగ్లాదేశ్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాన్ని మోహరించాలని అన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

“మనకు బంగ్లాదేశ్‌లో కుటుంబాలు, ఆస్తులు, మనకు ఇష్టమైనవారు ఉన్నారు. దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరిని అవలంబించినా మేము అంగీకరిస్తాము. అయితే, ప్రపంచంలో ఎక్కడైనా సరే మతపరంగా జరిగే దురాగతాలను మేము ఖండిస్తూనే ఉంటాము. బంగ్లాదేశ్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాము” అని మమతా బెనర్జీ అన్నారు.

ఇస్కాన్ కోల్‌కతా యూనిట్ చీఫ్‌తో తాను మాట్లాడి సానుభూతిని, మద్దతును ప్రకటించినట్లు మమత తెలిపారు. బంగ్లాదేశ్‌లో భారతీయులపై దాడి జరిగితే దాన్ని తాము సహించలేమని అన్నారు. తాము తమ ప్రజలను తిరిగి తీసుకురాగలమని చెప్పారు. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లవచ్చని, యూఎన్‌ శాంతి పరిరక్షక దళాన్ని పంపవచ్చని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్.. ఏక్‌నాథ్ షిండే కుమారుడు సంచలన ట్వీట్