West Bengal Politics: 2024 ఎన్నికల కోసం మమతా బెనర్జీ కొత్త ప్లాన్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అంతేనట
భానగర్‌లో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో చెలరేగిన హింస కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ రోజున ఐఎస్‌ఎఫ్, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు

Indian Secular Front: పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దానికి పైగా వామపక్షాల ఆధిపత్యానికి స్వస్తి పలికి తన ఆధిక్యతను నెలకొల్పిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మిషన్ 2024కి సిద్ధమయ్యేందుకు పశ్చిమ బెంగాల్‌లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక ప్రకారం, ఆమె కోల్‌కతా పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ముస్లింల ప్రాబల్యం ఉన్న భానగర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి బెంగాల్ లో నిరంతరాయంగా జెండా ఎగురవేస్తున్న టీఎంసీ అధినేతకు ఈ ప్రాంతాన్ని కోల్‌కతా కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
శక్తివంతమైన నాయకురాలు అయినప్పటికీ, దక్షిణ 24 పరగణాలకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో మమతా బెనర్జీకి బలమైన పట్టు లేదు. ఈ ప్రాంతమంతా ముస్లింల ప్రాబల్యంలో ఉంది. ఇందులో భానగర్‌పై మమతాకి ఉన్న పట్టు స్వల్పమే. ఇక్కడ చాలా ప్రాంతం నీటి నడుమ ఉంటుంది. ఈ ప్రాంతం న్యూ కోల్‌కతా సమీపంలో అభివృద్ధి చెందుతున్న రాజర్‌హట్ పట్టణానికి చాలా దగ్గరగా ఉంది.
ఇక్కడ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) పట్టు చాలా బలంగా ఉంది. ప్రస్తుతం ఈ పార్టీ నుంచి ఎమ్మెల్యే నౌషాద్ సిద్ధిఖీ ఆధిక్యంలో ఉన్నారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్‌లో నిరంతరం అధికారంలో ఉన్నప్పటికీ, భాంగర్‌లో మమతా పార్టీ రెండుసార్లు ఓడిపోయింది. ప్రస్తుతం ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2021 ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ అభ్యర్థి నౌషాద్ సిద్ధిఖీ గెలిచారు.
Ramdas Athawale: మళ్లీ బీజేపీ చెంతకు నితీశ్ కుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీని 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నౌషాద్ సిద్ధిఖీ అన్న అబ్బాస్ సిద్ధిఖీ స్థాపించారు. అతను ఫుర్ఫురా షరీఫ్ పుణ్యక్షేత్ర మత గురువు. ముస్లింలు, దళితుల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన ఈ పార్టీని స్థాపించారు. ఐఎస్ఎఫ్ 2021 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలతో పొత్తుతో పోటీ చేసింది. అయినప్పటికీ ఎన్నికల్లో రాణించలేదు. కానీ మొదటి ప్రయత్నంలోనే తన ఖాతాను తెరవడంలో విజయం సాధించింది.
భానగర్‌లో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో చెలరేగిన హింస కారణంగా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ రోజున ఐఎస్‌ఎఫ్, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత జూలై 11న పంచాయతీ ఎన్నికల ఫలితాల రోజున ఈ ప్రాంతంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఇందులో ముగ్గురు యువకులు చనిపోయారు. ఇందులో ఇద్దరు ఐఎస్ఎఫ్ మద్దతుదారులు ఉన్నారు.