Odisha : భార్య శీలంపై అనుమానంతో ఒక వ్యక్తి… భార్య తలనరికి అది పట్టుకుని 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. దెన్కనల్ జిల్లా చంద్రశేఖర్‌పూర్ కు చెందిన నకపోడి మాఝీ అలియాస్ జందా కు భార్య చంచలపై అనుమానం పెరిగింది.
భార్య పరాయి పురుషునితో సంబంధంలో ఉందనే అనుమానం అతడిని వేధించసాగింది. ఈ విషయమై కొద్ది రోజులుగా భార్యాభర్తలు గొడవపడుతున్నారు. రోజూలాగే గురువారం రాత్రి కూడా భార్యతో గొడవపడిన జందా ఆవేశంతో పదునైన ఆయుధంతో భార్య చంచల తల నరికాడు. ఈ రోజు ఉదయం నిందితుడు తెగిపడిన భార్య తల తీసుకుని రోడ్డుపై 12 కిలోమీటర్లు నడుచుకుంటూ గొందియా పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్నిస్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భార్య తలతో నడుచుకుంటూ వెళుతున్న జందాను కొందరు వీడియో తీశారు. ఆవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Gang Rape : 16 ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్