Vande Bharat: రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో మూత్రం చేయడానికి ఎక్కుతున్నారా? ఇలాగే వందేభారత్ ట్రైన్ ఎక్కిన హైదరాబాద్ వ్యక్తికి ఏం జరిగిందో తప్పనిసరిగా తెలుసుకోండి

అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు. అతడు హైదరాబాద్‭లో సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు చేరుకున్న వారు రైలులో సింగ్రౌలీకి వెళ్లాల్సి ఉంది.

Vande Bharat: రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో మూత్రం చేయడానికి ఎక్కుతున్నారా? ఇలాగే వందేభారత్ ట్రైన్ ఎక్కిన హైదరాబాద్ వ్యక్తికి ఏం జరిగిందో తప్పనిసరిగా తెలుసుకోండి

Abdul Qadir: రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అర్జెంటుగా మూత్రం చేయాల్సి వస్తే.. ఆగి ఉన్న రైళ్లోకి టకీమని దూకేస్తుండడం మామూలే. అయితే ఇది కొన్ని సార్లు ఊహించని కష్టాల్లోకి తీసుకెళ్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక హైదరాబాదీకి ఎదురైన అనుభవమే ఇందుకు చక్కని ఉదాహరణ. భోపాల్ రైల్వే స్టేషన్లో యూరిన్ చేయడం కోసం ఆగి ఉన్న వందే భారత్ రైలు ఎక్కి ఆరు వేల రూపాయలు కోల్పోయాడు. అసలు ఏం జరిగింది? అంత పెద్ద మొత్తం ఎందుకు కోల్పోయాడో తెలుసుకుందాం.

Raghunandan Rao: పిల్లలు స్కూల్ కు వెళ్లిన తర్వాత సెలవు ప్రకటిస్తారా.. ధన్యవాదాలు అంటూ సెటైర్లు

అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు. అతడు హైదరాబాద్‭లో సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు చేరుకున్న వారు రైలులో సింగ్రౌలీకి వెళ్లాల్సి ఉంది. వారు జూలై 15 సాయంత్రం 5.20 గంటలకు భోపాల్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి సింగ్రౌలీకి రాత్రి 8.55 గంటలకు రైలు ఎక్కవాల్సి ఉంది.

YS Jagan: సీఎం జగన్ మనసులో ఏముంది.. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తారా?

భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు అబ్దుల్ ఖాదిర్ కు మూత్ర విసర్జన చేయవలసి వచ్చింది. అంతే, వెంటనే అతడు ఆగి ఉన్న ఇండోర్‌కు వెళ్లే వందేభారత్ రైలులో టాయిలెట్‌ను ఉపయోగించేందుకు ఎక్కాడు. అయితే, అబ్దుల్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చే లోపే రైలు తలుపులు లాక్ చేయబడి ఉన్నాయి. అది కదలడం ప్రారంభించింది. అబ్దుల్ వేర్వేరు కోచ్‌లలో ఉన్న ముగ్గురు టిక్కెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసు సిబ్బంది నుంచి సహాయం కోరేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ మినహా మరెవరూ తలుపులు తెరవలేరని వాళ్లు తేల్చి చెప్పారు. కాగా, డ్రైవర్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిని అడ్డుకున్నారు.

Manipur Violence: పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ ప్రకంపనలు.. వాయిదా తీర్మానాలు ఇచ్చిన విపక్షాలు

చివరకు టికెట్ లేకుండా రైలు ఎక్కినందుకు అబ్దుల్ కు 1,020 రూపాయల జరిమానా పడింది. మధ్యలో ఉజ్జయిని జంక్షనులో రైలు ఆగినప్పుడు అక్కడ దిగి, భోపాల్‌కు బస్సుపై వచ్చాడు. దానికి అదనంగా 750 రూపాయల టికెట్ ఖర్చు అయింది. ఇక అబ్దుల్ రైలులో ఇరుక్కుపోయినప్పుడు అతడి భార్య, కొడుకు సింగ్రౌలీకి వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కకుండా స్టేషన్ లోనే ఉన్నారు. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్‌రౌలీకి వెళ్లాలనుకున్న రైలు ప్రయాణం కోసం బుక్ చేసిన 4,000 రూపాయల టిక్కెట్‌ డబ్బులు వృధా అయ్యాయి.

Manipur Violence: మణిపూర్ దారుణ వీడియో ఘటనలో ఎట్టకేలకు ఒకరిని అరెస్ట్ చేశారు

ఇలా.. మూత్రం చేద్దామని ఆగి ఉన్న వందే భారత్ రైలు ఎక్కి బాత్‌రూమ్‌ని ఉపయోగించినందుకు అబ్దుల్ కనీసం 6,000 రూపాయలు కోల్పోయాడు. వందేభారత్ రైళ్లలో అత్యవసర వ్యవస్థ లేకపోవడంతో తన కుటుంబం మానసిక వేధింపులకు గురైందని అబ్దుల్ ఆరోపించాడు. ఈ ఘటన రైలులోని ఎమర్జెన్సీ సిస్టమ్‌లోని లోపాలను ఎత్తిచూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకపోతే.. రైల్వే స్టేషన్లో ఆగిఉన్న రైల్లోకి ఎక్కడం చాలా మందికి అలవాటు. అలా ఎక్కే ముందు ఒక్కసారి ఈ ఘటనను గుర్తు చేసుకోండి. ప్రమాద సందర్భాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్త పడతారు.