Dead Man Returns Alive : ఇదేందయ్యా ఇది.. కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయాడు, కట్ చేస్తే 13రోజుల తర్వాత సజీవంగా ఇంటికొచ్చాడు.. షాక్ లో కుటుంబసభ్యులు, బంధువులు..

చనిపోయిన రోజు నుంచి 13వ రోజున సంతాప సభ ఏర్పాటు చేశారు. బంధువులంతా తరలి వచ్చారు.

Dead Man Returns Alive : కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తి తిరిగి బతికొచ్చాడు. ఏంటి.. షాకింగ్ గా ఉంది కదూ. మనకే ఇంత విచిత్రంగా అనిపిస్తే.. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఆ వ్యక్తి చనిపోలేదు. బతికే ఉన్నాడు. తిరిగి ఇంటికి తిరిగొచ్చాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. చాచంద్ గలీకి చెందిన కుంతి గురు.. కుంభమేళాలో జనవరి 29వ తేదీన జరిగిన తొక్కిసలాటలో చనిపోయాడని అధికారులు ప్రకటించారు. దీంతో అతడి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుంతి గురు ఫోటోకు దండ వేశారు. కర్మలు జరిపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అతడు చనిపోయిన రోజు నుంచి 13వ రోజున సంతాప సభ ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర కర్మలకు ఏర్పాట్లు చేశారు.

కుటుంబసభ్యులు, బంధువులు సంతాప సభలో పాల్గొన్నారు. అయితే, వారందరికి ఊహించని షాక్ తగిలింది. చనిపోయాడని అనుకున్న వ్యక్తి.. తిరిగి కళ్ల ముందు సజీవంగా కనిపించాడు. దాంతో అంతా బిత్తరపోయారు. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఇది నిజమా కాదా అని కాసేపు తేల్చుకోలేకపోయారు. చివరికి తేలింది ఏమిటంటే.. కుంతి గురు అసలు చనిపోలేదు. బతికే ఉన్నాడు. ఈ 13 రోజులు అతడు సాధువులతో గడిపాడట. దాదాపు రెండు వారాల తర్వాత అతడు తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే, తన కుటుంబసభ్యులు తన కర్మలు జరిపిస్తున్నారనే విషయం అతడికి తెలియదు పాపం.

Also Read : మహాశివరాత్రి నాడు చంద్రుని గోచారం.. ఈ 3 రాశుల వారు నక్కతోక్క తొక్కినట్టే.. డబ్బుల వర్షం కురుస్తుంది..!

ఆటో నుంచి కిందకు దిగిన కుంతి గురు.. తన ఇంటి దగ్గర గుమికూడిన బంధువులను చూసి కంగుతిన్నాడు. మీరంతా ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు. అంతే.. కుంతి గురుని సజీవంగా చూసి.. బంధువుల నోళ్లు పడిపోయాయి. వారి నోట మాట రాలేదు.

మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానం చేసేందుకు కుంతి గురు జనవరి 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాతి రోజే అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురు చనిపోయారు. తొక్కిసలాట ఘటన జరిగిన రోజు నుంచి కుంతి గురు ఆచూకీ లభించలేదు. దాంతో తొక్కిసలాటలో కుంతి గురు కూడా చనిపోయి ఉంటాడని బంధువులు, కుటుంబసభ్యులు ఫిక్స్ అయిపోయారు. తొక్కిసలాట ఘటన తర్వాత కుంతి గురు ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతికారు.

కొన్ని రోజులు అతడి కోసం గాలించారు. ఎక్కడా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో కుంతి గురు కచ్చితంగా చనిపోయి ఉంటాడని వాళ్లంతా ఫిక్స్ అయిపోయారు. సంప్రదాయం ప్రకారం 13వ రోజున సంతాప సభకు ఏర్పాట్లు చేశారు. కుంతి గురు ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నారు. ఇందుకోసం బంధువులను ఇంటికి పిలిచారు. అయితే, వారికి ఊహించని షాక్ తగిలింది. చనిపోయాడని అనుకున్న వ్యక్తి సజీవంగా కనిపించడంతో అంతా విస్తుపోయారు. ఏదైతే ఏముంది.. కుంతి గురు ప్రాణాలతోనే ఉన్నాడని అంతా హ్యాపీగా ఫీలయ్యారు.

Also Read : బంగారం కొనేటప్పుడు జర జాగ్రత్త.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. డబ్బులు, బంగారం ఊరికే రావు కదా..!

జనవరి 29న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్య స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు సంగం వైపు తరలిరావడం తొక్కిసలాటకు దారితీసింది.