Maha Shivratri 2025 : మహాశివరాత్రి నాడు చంద్రుని గోచారం.. ఈ 3 రాశుల వారు నక్కతోక్క తొక్కినట్టే.. డబ్బుల వర్షం కురుస్తుంది..!

Maha Shivratri 2025 : జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మహాశివరాత్రి నాడు చంద్రుడి నక్షత్రరాశి మారనుంది. చంద్రుని నక్షత్రంలో ఈ మార్పుతో మూడు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. డబ్బు వర్షం కురియనుంది.

Maha Shivratri 2025 : మహాశివరాత్రి నాడు చంద్రుని గోచారం.. ఈ 3 రాశుల వారు నక్కతోక్క తొక్కినట్టే.. డబ్బుల వర్షం కురుస్తుంది..!

Maha Shivratri 2025

Updated On : February 19, 2025 / 4:46 PM IST

Maha Shivratri 2025 : మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు మహాశివుడు, పార్వతి ఒకటైన రోజు. అంటే.. శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని అర్థం. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి పండుగను ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి బుధవారం, ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సంవత్సరం మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనది.

Read Also : Chanakya Niti : డబ్బు అప్పుగా ఇస్తున్నారా? ఇలాంటి వ్యక్తులకు అసలు ఇవ్వొద్దు.. ఒక్క పైసా కూడా తిరిగిరాదు..!

ఎందుకంటే ఈ రోజున చంద్రుడు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిస్థితుల్లో మహాశివరాత్రి నాడు ధనిష్ట నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడంతో కొన్ని రాశులకు అద్భుతంగా కలిసిరానుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. చంద్రుని సంచారంతో ఈ మూడు రాశులకు మాత్రం డబ్బు బాగా కలిసి రానుంది. నక్కతొక్క తొక్కినట్టే.. డబ్బు వర్షంలో కురుస్తూనే ఉంటుందని విశ్వాసం. ఇంతకీ ఆ మూడు రాశులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగునున్నాయి? మీ రాశి కూడా అందులో ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి :
ఈ సంవత్సరం మహాశివరాత్రి మేష రాశి వారికి అత్యంత పవిత్రమైనది. మహాశివరాత్రి నుంచి వీరికి అన్ని మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీ కెరీర్‌కు సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారం చేసే వారికి ఆర్థిక లాభం గోచరిస్తోంది. మీ ఆఫీసుల్లో మీకు గౌరవం పెరుగుతుంది.

ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. అనవసర ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగవచ్చు. మీ సంతానానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటక రాశి :
ఈ సంవత్సరం మహాశివరాత్రి ఈ కర్కాటక రాశి వారికి చాలా పవిత్రమైనది. ఈ రోజు నుంచి కర్కాటక రాశి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు సంపాదించే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు, మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో ఆనందం వెల్లివెరుస్తుంది.

వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్ లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు ఉంటుంది. మీరు పిల్లల ద్వారా సంతోషాన్ని పొందుతారు. శివున్ని పూజిస్తే అన్ని శుభాలే కలుగుతాయి.

Read Also : Chanakya Niti : డబ్బు అప్పుగా ఇస్తున్నారా? ఇలాంటి వ్యక్తులకు అసలు ఇవ్వొద్దు.. ఒక్క పైసా కూడా తిరిగిరాదు..!

ధనుస్సు రాశి :
ఈ సంవత్సరం మహాశివరాత్రి ధనుస్సు రాశి వారికి కూడా చాలా శుభప్రదమైనది. ఈ రోజు నుంచి మీ కెరీర్ పురోగతి మొదలవుతుంది. ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీ ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.

మీకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుంచి లేదా కుటుంబంలోని పెద్ద సభ్యుల నుంచి మీకు భారీ ఆర్థిక సాయం అందవచ్చు.