Chanakya Niti : డబ్బు అప్పుగా ఇస్తున్నారా? ఇలాంటి వ్యక్తులకు అసలు ఇవ్వొద్దు.. ఒక్క పైసా కూడా తిరిగిరాదు..!

Chanakya Niti : అందరం డబ్బు అప్పుగా ఇస్తుంటాం. అప్పుగా ఇస్తే తప్పు లేదు. అది తీర్చకపోతేనే అసలు సమస్య. ఇలాంటి వ్యక్తులకు అసలు అప్పుగా డబ్బు ఇవ్వకూడదని చాణిక్యుడు సూత్రాల్లో సూచించాడు. ఓసారి మీరు చదివేయండి.

Chanakya Niti : డబ్బు అప్పుగా ఇస్తున్నారా? ఇలాంటి వ్యక్తులకు అసలు ఇవ్వొద్దు.. ఒక్క పైసా కూడా తిరిగిరాదు..!

Chanakya Niti

Updated On : February 19, 2025 / 4:07 PM IST

Chanakya Niti : అందరికి డబ్బు అవసరమే. అందరూ అప్పులు చేస్తారు.. అలాగే అందరికి అప్పులు ఇస్తుంటారు. కానీ, అప్పుగా తీసుకున్నవారి కన్నా అప్పుగా ఇచ్చినవారే ఎక్కువగా బాధపడుతుంటారు. అప్పు ఇస్తే తప్పు లేదు కానీ, ఆ తర్వాతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే.. తీసుకున్న అప్పు ఎగ్గొట్టిపోతుంటారు. అందుకే మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరికి పడితే వారికి అప్పుగా ఇవ్వకూడదు.

Read Also : Astrology Tips : రుద్రాక్ష ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన 9 విషయాలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

కొంతమంది వడ్డీ కోసం ఆశపడి కనిపించినవారికి అప్పు ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్లు డబ్బు తిరిగి చెల్లించక పోయేసరికి బాధపడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరాలను తీరుస్తుంది. ఈ మాట వాస్తవమే కావచ్చు. కానీ, మనం డబ్బు అప్పుగా వ్యక్తుల బట్టి మారుతుంటుంది. మీరు ఆర్థిక సాయం చేసినా వాళ్లు పట్టించుకోరు. అందుకే అప్పుగా ఎవరికి డబ్బు ఇవ్వాలో ముందే నిర్ణయించుకోవాలి. లేదంటే ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాణిక్యుడి నీతి ఇదే చెబుతోంది.

మీ జీవితంలో ఎదురయ్యే కొంతమంది వ్యక్తులకు పొరపాటున కూడా ఎప్పుడూ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారని మీకు తెలుసా? అలాంటి వారికి డబ్బు అప్పుగా ఇస్తే.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం మరచిపోతారు. నిజానికి, అలాంటి వ్యక్తులు బాధ్యతారహితంగా ఉంటారు.

ఒకరి నుంచి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వాలని వారికి ఉండదు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే మీపైనే ఆధిపత్యం చేస్తారు. ఇవ్వకపోతే ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా బెదిరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చింతించడం తప్ప మీరు ఏమి చేయలేరు. ఎలాంటి వ్యక్తులకు మీరు అప్పుగా డబ్బును ఇవ్వకూడదో చాణిక్యుడు చెప్పిన సూత్రాలను ఓసారి పరిశీలించండి..

ఎవరికి అప్పు ఇవ్వకూడదంటే..? :

బెదిరించే వ్యక్తులకు :
బెదిరింపులకు పాల్పడేవారికి అసలు డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు. ఎప్పుడూ ఒకరిపై ఆధిపత్యం చలాయించేవారికి అసలు ఇవ్వకూడదు. మీకన్నా బలవంతులకు కూడా అప్పు ఇవ్వొద్దు. ఒకవేళ ఇచ్చినా ఆ డబ్బులను తిరిగి రాబట్టుకోలేరు. గట్టిగా అడిగినా అప్పు ఇచ్చిన మిమ్మల్నే భయపట్టేందుకు ప్రయత్నిస్తారు. వీరి చేతుల్లో మీ డబ్బు వెళ్తే తిరిగి రావడం కష్టమే.

బాధ్యత లేని వ్యక్తులు :
అప్పు తీసుకునేవారికి బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే తీసుకున్న అప్పును చెప్పిన గడువు తేదీలోగా తీర్చుగలరు. బాధ్యత లేని వ్యక్తులకు మీరు అప్పుగా డబ్బును ఇస్తే మాత్రం ఆ డబ్బు ఎప్పటికీ మీకు తిరిగి రాదని గమనించాలి. అలాంటి వ్యక్తులు తరచుగా డబ్బు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వడం గౌరవానికి విరుద్ధమని భావిస్తారు. వీరి చేతుల్లో మీ డబ్బును పెడితే అదే అటు పోతుంది. ఒక్క పైసా కూడా తిరిగి చెల్లించరు.

గుర్తు తెలియని వ్యక్తులు :
మీకు అసలు తెలియని వ్యక్తులకు డబ్బును అప్పుగా ఎప్పుడూ ఇవ్వకూడదు. అప్పు ఇచ్చేవరకు మీ వెంటే తిరుగుతారు. ఒకసారి అప్పు ఇచ్చిన తర్వాత ముఖం చాటేస్తారు. జీవితంలో మీకు మళ్లీ కనిపించరు. డబ్బు ముట్టినవెట్టే అక్కడ నుంచి కనించకుండా పరారవుతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా అవుతుంది.

Read Also : Money Attract Tips : చాణక్యుడి ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.. వద్దన్నా వస్తూనే ఉంటుంది.!

తప్పులు చేసే వ్యక్తులు :
తప్పుడు కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు ఎప్పటికీ డబ్బు తిరిగి చెల్లించరు. అలాంటి వారికి డబ్బు అప్పుగా ఇవ్వడం ఎల్లప్పుడూ మానుకోవాలి. అలాంటి వారికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఎప్పటికీ రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

మాదకద్రవ్యాలకు బానిసలు :
మాదకద్రవ్యాలకు బానిసలైన వ్యక్తులకు ఎప్పుడూ అప్పు ఇవ్వకూడదు. ఆ డబ్బులను మద్యానికి మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఇక మీ డబ్బు తిరిగి చెల్లించలేరు. ఇలాంటి వ్యక్తులు అప్పుగా తీసుకున్న తమ వ్యసానాలకు డబ్బును ఖర్చు చేస్తారు. వీరు ఎలాగో సంపాదించరు. డబ్బులు తిరిగి చెల్లించలేరు. వీరికి ఎంత ఇచ్చినా మొత్తం డబ్బులను ఆ మద్యానికే వాడేస్తారు. వీరి దగ్గరి నుంచి మీరు ఒక్క రూపాయి కూడా రాబట్టలేరు.