Viral Video : బ్యాంకు క్యూలైన్ లో ఉండగా గుండెపోటు.. 5 సెకండ్లలో మృతి
గుండెపోటుతో బిగ్ బాస్ - 13 టైటిల్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఈ సమయంలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video (3)
Viral Video : హిందీ బిగ్ బాస్ -13 టైటిల్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మరణం అందరిని షాక్ కి గురిచేసింది. సంపూర్ణ ఆరోగ్యాంగా ఉన్న సిద్ధార్థ్ నలభై ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. నిజానికి, ఎవరూ నమ్మరు. అయితే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా, గుండెపోటు ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా వస్తుంది. కొంతమంది మాట్లాడుతూ.. వాకింగ్ చేస్తూ.. నవ్వుతూ.. అప్పటివరకు అందరితో సరదాగా ఉంటూ సడెన్ గా గుండెపోటుకు గురవుతున్నారు. సిద్ధార్థ్ మరణం తరువాత, గుండెపోటుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తన పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడుతూనే గుండెపోటు వచ్చి ఐదు సెకన్లలో మరణించాడు.
బ్యాంకుకి వచ్చిన ఓ వ్యక్తి.. తన పక్కన తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సుమారు నిమిషం పాటు మాట్లాడాడు. ఆ తర్వాత సడన్ గా ముందున్న బల్లపై బలం పెట్టి అనుకున్నట్లు చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయాడు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా పడిపోవడం చూసి చుట్టుపక్కల ప్రజలు భయపడిపోయారు. అతనికి ఏమి జరిగిందో కూడా వారికి అర్థం కాలేదు. వెంటనే ఆ వ్యక్తికి మంచినీరు ఇచ్చారు.
అయితే అతడు తాగే స్థితిలో లేడు. అప్పటికే మృతి చెందాడు. ఇదంతా ఐదు సెకండ్ల వ్యవధిలో జరిగిపోయింది. ఇక ఈ మొత్తం దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసి “లైవ్ హార్ట్ ఎటాక్” అనే హ్యాష్‌ట్యాగ్ ఇచ్చారు. సిద్ధార్థ్ శుక్లా మరణంతో తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన 2017లో జరగ్గా ఈ వీడియోను కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. మనిషి జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో ఎవరికి తెలియదు అంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.