Delhi 5-Star Hotel: సాధారణంగా 5 స్టార్ హోటళ్లలో స్టే చేసే వాళ్లు బిల్లులు ఎగ్గొట్టరు. ఎప్పుడో ఒకసారి.. ఎవరో ఒకరు మాత్రమే అలా చేస్తుంటారు. తాజాగా ఒక వ్యక్తి 5 స్టార్ హోటల్‌లో ఏకంగా 23 లక్షల బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. దీంతో హోటల్ యాజమాన్యం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి గత ఏడాది ఆగష్టు 1 నుంచి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ అనే 5 స్టార్ హోటల్‌లో బస చేశాడు. తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజ కుటుంబానికి కావాల్సిన వాడినని పరిచయం చేసుకున్నాడు. తాను అబుదాబి రాజ కుటుంబీకుడైన షేక్ ఫలా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు అత్యంత సన్నిహితుడినని హోటల్ సిబ్బందిని నమ్మించాడు. వ్యక్తిగత పనుల కోసం వచ్చానని చెప్పాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక కార్డును, ఇతర డాక్యుమెంట్లను కూడా చూపించాడు.
Rohit Sharma: వరల్డ్ కప్ కోసం బలమైన జట్టు తయారు చేయడమే లక్ష్యం: భారత కెప్టెన్ రోహిత్ శర్మ
దీంతో హోటల్ సిబ్బంది ఇదంతా నిజమేనని నమ్మారు. అతడికి 427 నెంబర్ గల రూమ్ కేటాయించారు. అప్పటి నుంచి అతడు నవంబర్ 20 వరకు బస చేశాడు. మధ్యలో తాను రాజ కుటుంబానికి సన్నిహితుడినని నమ్మించేందుకు ప్రయత్నించాడు. నవంబర్ 20 వరకు మొత్తం దాదాపు రూ.35 లక్షల బిల్ అయ్యింది. అయితే, అతడు రూ.11.5 లక్షలు మాత్రమే చెల్లించాడు. మిగతా రూ.23 లక్షలకు చెక్ ఇచ్చాడు. అయితే, అతడు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో షరీఫ్ మోసం బయటపడింది. అప్పటికే అతడు వెళ్లిపోయాడు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
షరీఫ్ కోసం గాలిస్తున్నారు. కాగా, అతడు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అని పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు హోటల్‌లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.