Karnataka: కాటేసిన పామును పట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన వ్యక్తి

బళ్లారిలోని కంప్లీ తాలూకాలో ఓ 30ఏళ్ల వ్యక్తి తనను కాటేసిన పాముతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉప్పరహల్లి గ్రామంలోని కడప్పా అనే వ్యక్తి చేతిపై కాటేసిన పామును పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

Karnataka: కాటేసిన పామును పట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన వ్యక్తి

Snake Bite

Updated On : June 14, 2021 / 11:13 PM IST

Karnataka: బళ్లారిలోని కంప్లీ తాలూకాలో ఓ 30ఏళ్ల వ్యక్తి తనను కాటేసిన పాముతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఉప్పరహల్లి గ్రామంలోని కడప్పా అనే వ్యక్తి చేతిపై కాటేసిన పామును పట్టుకుని తిరుగుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆదివారం ఉదయం కడప్పా పొలం పనులు చేసుకునేందుకు వెళ్లాడు.

ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పాము కాటేసింది. వెంటనే అతనికి ఫస్ట్ ఎయిడ్ గా యాంటీవీనం ఇంజక్షన్ ఇచ్చారు. మిగతా ట్రీట్మెంట్ కోసం VIMS హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. ఐసీయూలో చేరిన అతని ఆరోగ్యం క్రమంగా మెరుగవుతున్నట్లు వైద్యులు చెప్పారు.

పాము కాటేసిన వ్యక్తి బైక్ పై కూర్చొని యాంటీవీనం డోస్ తీసుకుని విమ్స్ హాస్పిటల్ కు రిఫర్ చేశారని వచ్చాడు. అతని చేతిపై పాము కాటేసినట్లు గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. పామును వదిలేయమని గ్రామస్థులు చెబుతున్నా వినిపించుకోకుండా దానిని తీసుకునే హాస్పిటల్ వరకూ వచ్చాడు.

తనను కాటేసిన పాము గురించి తెలియజేయడానికే అలా చేసి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.