బర్త్‌డే గిఫ్ట్‌గా BMW కారు.. నచ్చలేదని నదిలో తోసిన కొడుకు!

  • Published By: sreehari ,Published On : August 31, 2019 / 01:09 PM IST
బర్త్‌డే గిఫ్ట్‌గా BMW కారు.. నచ్చలేదని నదిలో తోసిన కొడుకు!

Updated On : August 31, 2019 / 1:09 PM IST

అందరి తండ్రుల్లాగే తన కొడుకు పుట్టినరోజుని తెగ సంబరపడిపోయాడో తండ్రి. కుమారుడు పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. కొడుకుకు BMW బ్రాండ్ కొత్త కారును సర్ ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఎంతో ముచ్చటపడి కొడుకు పుట్టినరోజు బహుమతిగా తండ్రి ఖరీదైన కారును కొనిస్తే.. ఆ కారును నడిపి ఎంజాయ్ చేయాల్సింది పోయి నదిలో తోసేశాడు. ఈ ఘటన హరియాణలోని పశ్చిమ యుమునా నది దగ్గర జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన ఆకాశ్ అనే యువకుడి తండ్రి సంజీవ్ కుమార్ రెండు నెలల క్రితం BMW 3 సిరీస్ కొత్త కారును బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ, కుమారుడికి ఆ లగ్జరీ కారు నచ్చలేదు. వెంటనే.. ఆ కారును తీసుకెళ్లి యుమునా నదిలో తోసేశాడు. ఆకాశ్.. ఎప్పటినుంచో తన తండ్రిని జాగూర్ మోడల్ కారు కావాలని గోల చేస్తున్నాడు. అతడి తండ్రి కారు కొనలేకపోయాడు.

చివరిగా BMW కారును బహుమతిగా ఇచ్చాడు. జాగూర్ కారును కొనివ్వలేదనే కోపంతో ఆకాశ్.. లగ్జరీ కారును నదిలోకి నెట్టేసినట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. యువకుడి కుటుంబ సభ్యులు అతడి పోరు తట్టుకోలేక తమ ఇన్నోవా కారును అమ్మేసి బీఎండబ్ల్యూ కారును కొన్నారు. అది నచ్చని ఆకాశ్.. BMW కారును డ్రైవ్ చేసుకుని వెళ్లి నదిలో నెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నది నీటిలో మునిగిన బీఎండబ్ల్యూ కారు వీడియోలో చూడొచ్చు. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు నమోదు కాకపోవడంతో పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..