ఓ ప్రేమికుడి వింత ప్రశ్నకు సీపీ రిప్లై..నెటిజన్ల ప్రశంసలు
ట్విట్టర్‌లో లైవ్ ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూణే పోలీస్ కమిషనర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. పోలీస్ కమిషనర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Pune cop ట్విట్టర్‌లో లైవ్ ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూణే పోలీస్ కమిషనర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. పోలీస్ కమిషనర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా బాగా సమాధానం చెప్పారంటూ ఆయనను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అసలు ఆయనకు ఎదురైన ప్రశ్న ఏంటీ?ఆయన ఇచ్చిన సమాధాం ఏంటో చూద్దాం
సోమవారం పూణె పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా.. ‘‘లెట్స్ టాక్ సీపీ పూణె సిటీ’’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ లైవ్‌లోకి వచ్చారు. ఇందులో నెటిజెన్లు వేసిన పలు రకాల ప్రశ్నలకు పూణె సీపీ అమితాబ్ గుప్తా సమాధానాలు చెప్పుకొచ్చారు. గంటకు పైగా ఆయన నెటిజన్లకు.. కోవిడ్-19 ప్రోటోకాల్స్, మహిళల భద్రత,ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వంటి పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. అయితే, ఓ నెటిజన్..పోలీసులంటే ఏ సమస్యనైనా పరిష్కరిస్తారనుకున్నాడో ఏమో ఏకంగా తన లవ్ మేటర్‌ను సీపీకి చెప్పాడు. తాను ప్రేమిస్తున్న యువతి తన ప్రేమను అంగీకరించడం లేదని, దాని కోసం ఏదైనా చేయమని మరియు తన లవ్ ప్రపోజల్‌ను అంగీకరించేలా తన గర్ల్ ఫ్రెండ్‌ను ఒప్పించాలని కమిషనర్‌ను కోరారు.
అయితే.. ఏమాత్రం సహనం కోల్పోని సీపీ అమితాబ్ గుప్తా శాంతంగా సమాధానమిచ్చారు. దురదృష్టవషాత్తూ, ఆమె అంగీకారం లేకుండా మేము ఎలాంటి సహాయమూ చేయలేము. మీరు కూడా ఆమెకు ఇష్టంలేని పనులు చేయవద్దు. ఒకవేళ ఆమె ఏదో ఒకరోజు నీ ప్రేమను అంగీకరిస్తే.. తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు నీకు ఉంటాయని సీపీ ఆ యువకుడికి సమాధానమిచ్చారు. అంతేకాదు.. ‘నోమీన్స్‌నో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జతచేసి ఆయన ట్వీట్ చేశారు. సీపీ ఇచ్చిన రిప్లై నెటిజెన్లను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ఆయనపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Unfortunately, without her consent, even we can’t be of any help. Nor should you do anything against her will. And if she does agree some day, you have our best wishes and blessings. #ANoMeansNo #LetsTalkCPPuneCity @PuneCityPolice https://t.co/aBrVTm0KI8
— CP Pune City (@CPPuneCity) March 8, 2021