Illegal Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య
భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణం.. భార్య ఆమె ప్రియుడే అని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

illegal affair
Illegal Affair : భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోమతి నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోమతి నగర్ కు చెందిన నిఖిల్ కు 2012లో వివాహం జరిగింది. నిఖిల్ స్థానికంగా కిరణం నడుపుతున్నాడు.. అతడి భార్య ఓ ఎన్జీవో సంస్థలో పని చేస్తోంది. అయితే గత కొంతకాలంగా భార్య ప్రవర్తన సరిగా లేదు. ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు నిఖిల్ కి తెలిసింది. దీంతో ఆమెను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇరువురికి మధ్య వాగ్వాదం జరిగింది.
చదవండి : Uttar Pradesh : లఖింపూర్ ఘటనపై యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇదే సమయంలో తన ప్రియుడిని మర్చిపోయే ప్రసక్తే లేదని తన సంబంధానికి అడ్డు రావొద్దని భార్య భర్త నిఖిల్ కు తెగేసి చెప్పింది. లేదంటే అంతు చూస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపం చెందిన నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో నాలుగు పేజీల లేఖ లభ్యమైంది. తన చావుకు భార్య, ఆమె ప్రియుడే కారణమని.. వారిని కఠినంగా శిక్షించాలని తన సూసైడ్‌లో రాశాడు. తన కూతురికి వారిద్దరితో ప్రాణహాని ఉందని నోట్ పేర్కొన్నాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి : Uttarakhand : ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం..తెలుసుకోవాల్సిన విషయాలు