Uttarakhand : ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం..తెలుసుకోవాల్సిన విషయాలు

ఛార్ ధామ్ యాత్ర..మరలా ప్రారంభం కాబోతోంది. గతంలో కరోనా కారణంగా ఈ యాత్రను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Uttarakhand : ఛార్ ధామ్ యాత్ర ప్రారంభం..తెలుసుకోవాల్సిన విషయాలు

Uttarakhand

Chardham Yatra : ఛార్ ధామ్ యాత్ర..మరలా ప్రారంభం కాబోతోంది. గతంలో కరోనా కారణంగా ఈ యాత్రను అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైరస్ అదుపులో ఉండడం..యాత్రపై ఉన్న నిషేధాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు ఎత్తివేసిన నేపథ్యంలో… యాత్రకు అనుమతినివ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. కోవిడ్ నిబంధనల అమలు చేస్తామని, కఠినంగా ఉంటూనే…తీర్థ యాత్రలు నిర్వహించుకోవచ్చని కోర్టు వెల్లడించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Read More : CJI NV Ramana : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణకు ఆహ్వానం

పవిత్రమైన తీర్థం : –
యాత్రకు వచ్చే వారు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్స్, వ్యాక్సినేషన్ ధృవపత్రాన్ని చూపాల్సేందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలిసి, తెలియక చేసిన తప్పులు చేసి ఉంటే..కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే..పాపాలన్నీ పోతాయని నమ్మకం.  ఇక ఛార్ ధామ్ యాత్ర విశేషాలకు వస్తే…ఈ యాత్రకు ప్రపంచంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు. ఇక్కడకు వచ్చే వారు యమునోత్రి, గంగోత్రి, కేదరినాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను కూడా సందర్శిస్తుంటారు. అత్యంత పవిత్రమైన తీర్థ యాత్రల్లో ఛార్ ధామ్ యాత్రను కూడా పిలుస్తుంటారు.

Read More : viral letter : మా ఊరికి రోడ్డు వేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటా..ప్రధానితో పాటు CMకు యువతి లెటర్

12 వేల అడుగుల ఎత్తు : –
ఈ పేరులో ఉన్నట్లేనాలుగు పుణ్యక్షేత్రాల దర్శనాన్నే ఛార్ ధామ్ యాత్ర అని పిలుస్తుంటారు. బదరీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి సందర్శనను ఛార్ ధామ్ యాత్రగా పేర్కొంటుంటారు. బదరీనాథ్ తప్ప మూడు పుణ్యక్షేత్రాలను ఎప్పుడైనా సందర్శించుకొనే అవకాశం ఉంది. బదరీనాథ్, యుమనోత్రి, గంగోత్రి, కేదరీనాథ్ లను కలిపి మినీ ఛార్ ధామ్ యాత్ర అంటారు. ఈ యాత్ర దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో ఇరుకైన దారుల వెంట యాత్ర కొనసాగుతుంది. పది రోజుల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఛార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. చల్లని పర్యాటక ప్రాంతాలుగా పేరు గాంచిన ఈ క్షేత్రాలను వేసవిలో కూడా సందర్శిస్తుంటారు.