Indian Army : ఆర్మీ వండర్ ఫుల్ ఆపరేషన్.. డ్రోన్ సాయంతో మనిషిని ఎలా కాపాడారో చూడండి..

Indian Army : రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని ఆయాద్ నది వరదల్లో 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. ఇండియా ఆర్మీ డ్రోన్ సహాయంతో ఒడ్డుకు చేర్చింది.

Indian Army

Indian Army : భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వస్తున్న వరదల కారణంగా స్థానిక ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితే రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ చోటు చేసుకుంది.

Also Read: US Operation : కిమ్‌కే ఎర్త్ పెడదామని ట్రై చేసిన ట్రంప్.. ఆరుగురు సీల్ కమాండోలు ఎంట్రీ.. కట్ చేస్తే..

ఉదయపూర్‌లోని ఆయాద్ నది వరదల్లో 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. అయితే, ఇండియా ఆర్మీ రిమోట్ సాయంతో డ్రోన్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని ఆయాద్ నదిలోకి ఒక్కసారిగా వరద వచ్చింది. నది మధ్యలో ఓ బండరాయిపై 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కేకలు వేశాడు. అధికారులు స్థానికుల సహాయంతో అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. దీంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది.


ఆర్మీ సిబ్బంది వినూత్న పద్దతిలో సురక్షితంగా వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. ఇందుకోసం డ్రోన్లను ఉపయోగించారు. తొలుత డ్రోన్‌కు తాడునుకట్టి రిమోట్‌తో ఆపరేట్ చేస్తూ ఆ డ్రోన్ ను నదిలో చిక్కుకున్న వ్యక్తికి వద్దకు పంపించారు. ఆ తరువాత లైఫ్ జాకెట్ ను పంపించారు. లైఫ్ జాకెట్ ను ధరించిన వ్యక్తి.. ఆ తరువాత తాడును నడుముకు కట్టుకున్నాడు. నీటి ప్రవాహానికి అనుగుణంగా నీటిలో దూకాడు. ఒడ్డున ఉన్న ఆర్మీ సిబ్బంది అతన్ని తాడు సమాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.