Itching Powder On Minister: ఆ పౌడర్ చల్లిన వ్యక్తి .. కుర్తా విప్పేసి మరీ గోక్కున్న మంత్రి..

మధ్యప్రదేశ్ లోని దేవార్చి గ్రామంలో బీజేపీ వికాస్ యాత్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ఒక్కసారిగా దురద పుట్టి గోక్కోవటం ప్రారంభించారు. అలా గోక్కుంటునే ఉన్నారు. చాలాసేపు గోక్కున్నా ఆ ప్రక్రియ కొనసాగుతున్నా పాపం మంత్రిగారికి దురద తీరలేదు. ఏకంగా కుర్తా విప్పేసి మరీ గోక్కున్నా దురద తగ్గలేదు.

Itching Powder On Minister: ఆ పౌడర్ చల్లిన వ్యక్తి .. కుర్తా విప్పేసి మరీ గోక్కున్న మంత్రి..

itching powder on minister Brijendra Singh Yadav

Updated On : February 10, 2023 / 4:17 PM IST

itching powder on minister Brijendra Singh Yadav : మధ్యప్రదేశ్ లోని దేవార్చి గ్రామంలో బీజేపీ వికాస్ యాత్రలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఈ యాత్రలో పాల్గొన్న మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ ఒక్కసారిగా దురద పుట్టి గోక్కోవటం ప్రారంభించారు. అలా గోక్కుంటునే ఉన్నారు. చాలాసేపు గోక్కున్నా ఆ ప్రక్రియ కొనసాగుతున్నా పాపం మంత్రిగారికి దురద తీరలేదు. ఏకంగా కుర్తా విప్పేసి మరీ గోక్కున్నా దురద తగ్గలేదు. ఓ గోక్కోవటం కొనసాగిస్తునే మరోపక్క యాత్రలో పాల్గొన్నప్రజలతో మాట్లాడుతున్నారు. కానీ మంత్రి అలా గోక్కోవటం చూసినవారు పైకిమాత్రం కనిపించకుండా నవ్వుకున్నారు. మంత్రిగారి గోకుడు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ మంత్రిగారు అంత దారుణంగా అంతమంది మధ్యలో కూడా అంత తీవ్రంగా గోక్కోవటానికి కారణం ఓ వ్యక్తి చేసిన ఘనకార్యమే. యాత్రలో పాల్గొన్న మంత్రిపై ఓ వ్యక్తి దురద కలిగించే పౌడర్ చల్లాడు. ఇలాంటి దాడులు కూడా చేస్తారా అనిపించేలా మంత్రిపై ఓ వ్యక్తి దురద కలిగించే పౌడర్ చల్లాడు. దీంతో పాపం మంత్రిగారి పాట్లు చూడాలి..అంతమందిలో ఉండి గోక్కోవటం సభ్యతగా అనిపించకపోయినా తీట తగ్గకపోవటంతో గోక్కోవటం మానలేకపోయారు.

దురద ఎంతకీ తగ్గకపోవటంతో కుర్తా విప్పేసి మరీ గోక్కున్నారు. అయినా తగ్గలేదు. సిబ్బంది అందించిన నీళ్లతో శరీరంపై పౌడర్ పడిన చోట శుభ్రంగా కడుక్కున్నారు. తన పరిస్థితిని వివరించారు అక్కడివారికి. ఏచేస్తాం మరి దురదకు తెలియదు కదా అంతమందిలో ఉన్నారని ఆయన మంత్రిగారని..అలా పాపం దురద బాధను అక్కడున్నవారికి నవ్వుతూనే చెప్పారు. దీంతో అసలు విషయం తెలిసి మంత్రి నవ్వులతో శృతి కలిపారు అక్కడున్నవారంతా..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా..మంత్రి కుర్తా తలపైనుంచి తీసేటప్పుడు ఆ పౌడర్ ఆయన ముఖానికి కూడా అంటుకోవటంతో మొహం కూడా దురద పుట్టి ఎర్రగా మారిపోయింది.

కాగా మంత్రిగారిపై ఓ వ్యక్తి కావాలనే దురద కలిగించే పౌడర్ వేసినట్లుగా తెలిసింది. కౌండ్ అనే కాయలపై ఉండే ముళ్లగరికెలు (దురద గుండలాంటిది ) శరీరానికి తగిలితే విపరీతమైన కలుగుతుంది. మంట కలిగి దురద పుడుతుంది.గోకితే ఎర్రగా దద్దుర్లు వస్తాయి. ఈ మొక్కల శాస్త్రీయ నామం ముకునా ప్రూరియన్స్(Mucuna Pruiens). కాగా సదరు కౌంచ్ పౌడర్ చల్లిన వ్యక్తి కోసం పోలీసులు, పార్టీ కార్యకర్తలు గాలిస్తున్నారు.