Manmohan Singh: ఒరాక్ ఒబామా తాను రాసిన పుస్తకంలో మన్మోహన్ సింగ్ గురించి ఏమన్నారో తెలుసా?

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల అమెరికా సంతాపం తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతికి ఆయన పునాది వేశారని, యూఎస్, ఇండియా పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో

Barack Obama with Manmohan Singh

Manmohan Singh Passes Away: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున ఆయన మృతదేహాన్ని మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని తన నివాసానికి తరలించారు. మన్మోహన్ పార్ధీవదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలు కర్ణాటకలోని బెలగావి నుంచి ఢిల్లీకి చేరుకొని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్ధివదేహానికి నివాుళులర్పించి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. మన్మోహన్ సింగ్ మృతితో ఇవాళ్టి అధికారిక అన్ని కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏడు రోజులు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఇవాళ ఉదయం 11గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. అందులో మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించనున్నారు.

Also Read: Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతిపట్ల పవన్ కల్యాణ్, జగన్ మోహన్ రెడ్డి సంతాపం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల అమెరికా సంతాపం తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతికి ఆయన పునాది వేశారని, యూఎస్, ఇండియా పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ నాయకత్వం కీలకం అని యూఎస్ విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోతాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం రాష్ట్రపతి భవన్ పై జాతీయ జెండాను స్తంభానికి సగభాగంలోకి దించి ఎగురవేశారు. అదేవిధంగా మెల్బోర్న్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ లో రెండోరోజు ఆట జరుగుతుంది. ఈ సందర్భంగా మన్మోహన్ మృతికి సంతాపకంగా భారత్ జట్టు ఆటగాళ్లు తన చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలోకి వచ్చారు.

Also Read: Manmohan Singh: తెలంగాణలో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాకు ప్రత్యేకమైన అభిమానం. వారి హయాంలో 2008లో ఇరు దేశాల మధ్య అణుఒప్పందం జరిగింది. కెనడాలోని టొరంటో వేదికగా జరిగిన జీ20 సదస్సులో మన్మోహన్ సింగ్ పై ఒబామా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని చెబితే ప్రజలు తప్పకుండా వింటారనే మాటను మీరు నిజం చేశారని ఈ వేదికపై నుంచి నేను బలంగా చెబుతున్నానని ఒబామా ప్రశంసించారు. అదేవిధంగా ఒబామా రాసిన ‘ఎ ప్రామిస్ట్ ల్యాండ్’ అనే పుస్తకంలో మన్మోహన్ గురించి ప్రస్తావించారు. ‘‘ఆయన అసాధారణ ప్రతిభ కలిగిన నిజాయతీపరుడు. భారత ప్రజల శ్రేయస్సు, ఆర్థిక సంస్కరణల కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారు. తన సంస్కరణలతో ఎంతోమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆలోచనాత్మకమైన, కపటం లేని నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం మన్మోహన్ సింగ్ సొంతం’’ అంటూ ఒబామా పేర్కొన్నారు.