Taj Mahal : తాజ్​మహల్​, ఆగ్రా కోట సందర్శనపై కొవిడ్​ ఎఫెక్ట్​..!

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది.

Manual ticket counters : దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. టూరిస్ట్ ప్రాంతాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు కరోనా పెరుగుతున్నా.. పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. కరోనా ఎఫెక్ట్.. ప్రధానంగా ఉత్తర్​ప్రదేశ్​, ఆగ్రాలోని తాజ్​మహల్​, ఆగ్రా కోట సందర్శనలపై పడింది. కరోనా కేసులతో మాన్యూవల్​ టికెట్​ కౌంటర్లను అధికారులు మూసివేశారు.

భారీగా జనం గుడిగూడుతున్న నేపథ్యంలో అధికారులు ఈ దిశగా నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ, చారిత్రక కట్టడాల సందర్శనను మాత్రం పూర్తిగా నిలిపివేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ‘టికెట్​ కౌంటర్ల వద్ద భారీగా జనం చేరుతున్నారు. మాన్యువల్​ టికెట్​ కౌంటర్లను మూసివేయాలని నిర్ణయించామని సూపరింటెండింగ్​ ఆర్కియాలజిస్ట్​ డాక్టర్ రాజ్​ కుమార్​ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూపీలో సోమవారం కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 ఒమిక్రాన్​ కేసులను గుర్తించినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వారం వ్యవధిలోనే సమారుగా ఐదు రెట్లు కరోనా కేసులు నమోదు కోవడం ఆందోళన రేకిత్తిస్తోంది. సోమవారం ఒక్కరోజే మొత్తం 6,328 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజున 33వేలకు పెరిగాయి. కొత్త వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ సూచిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఒక్కొక్కటిగా ఆంక్షలు విధిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1700కి చేరగా.. 24 గంటల వ్యవధిలో 175 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read Also : Sriharikota : శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం.. 12మందికి పాజిటివ్

ట్రెండింగ్ వార్తలు