Hidma Encounter: మావోయిస్ట్ అగ్రనేత మడావి హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదా..పోలీసులు ముందుగానే అదుపులో తీసుకుని తర్వాత చంపేశారా? ఈ సందేహాలు ఎందుకంటే, దండకారణ్య స్పెషల్ జోన్ మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన ఓ లేఖ ఇందుకు కారణం. అంతేకాదు అసలు హిడ్మా ఎన్‌కౌంటర్‌కి ముందే పోలీసులకి అతని కదలికలపై సమాచారం అందించారని ఆరోపించారు. ఇందుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్లే కారణమని ఆరోపిస్తూ..ఈ మొత్తం ఎన్ కౌంటర్ వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.
దశాబ్దాల పాటు మావోయిస్ట్ ఉద్యమంలో పాల్గొన్న మాడవి హిడ్మా గత నెలలో ఎన్‌కౌంటర్‌లో చనిపోగా.. అదంతా వట్టిదే అని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అసలు అతని ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో చాలా ప్రజా సంఘాలు, మావోయిస్టులు.. మాజీ మావోలు కూడా ఇది పోలీసుల హత్య అంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది
దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్ కౌంటర్ అని, అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్ చికిత్స కోసం విజయవాడకు వెళ్లారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కలప వ్యాపారులతో కలిసి వెళ్లిన హిడ్మా, శంకర్ లను వారిచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలా కలప వ్యాపారులు చేసిన ద్రోహం కారణంగానే వారు దొరికిపోయారని తెలిపారు. చికిత్స కోసం విజయవాడ వచ్చి తిరిగి అడవిలోకి వెళ్తుండగా..పోలీసులు అదుపులోకి తీసుకున్నారని..ఆ తర్వాత వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారనేది ఈ లేఖ సారాంశం. ఈ మొత్తం బూటకపు ఎన్ కౌంటర్‌పై విచారణ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
వారం రోజులు నిర్బంధించి.. చిత్రహింసలు పెట్టి..
వికల్ప్ పేరిట విడుదలైన ఈ లేఖ ప్రకారం హిడ్మా, శంకర్ ఇద్దరూ కలప స్మగర్లు లేదంటే వ్యాపారులతో విజయవాడ వెళ్తే.. ఆ వ్యాపారులు ఎవరు..వారికి ఈ మావో అగ్రనేతలతో ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయ్. అంతేకాదు మావోల లేఖ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు చెందిన కలప వ్యాపారులతో కలిసి వెళ్లిన హిడ్మా, శంకర్ లను వారిచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. కొందరు కలప వ్యాపారులు చేసిన ద్రోహం కారణంగానే వారు దొరికిపోయారని తెలిపారు. వారం రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి హిడ్మాను పోలీసులు చంపేశారని ఈ లేఖలో పొందుపరిచారు.
అంతేకాదు..ఇటీవల తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన మాజీ మావోయిస్టు కోసాల్ కూడా పోలీసులకు హిడ్మా సమాచారం అందించారన్నారు. చికిత్స కోసం హిడ్మా అడవి నుంచి బయటకు వచ్చారన్న విషయం కోసాల్‌కు తెలుసని.. అసలు కోసాల్ లొంగిపోయిన విషయం తెలిసే, హిడ్మాను అడవిలోకి రావాలంటూ సమాచారం ఇచ్చామని వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా తన టీమ్‌తో అడవిలోకి రావడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కాంట్రాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ పేరిట హిడ్మాని చంపేశారని లేఖలో మావోయిస్టులు చెప్పుకొచ్చారు. దీంతో హిడ్మా ఎన్ కౌంటర్ వ్యవహారంపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మోదీ, పుతిన్ భేటీ జరిగే రూ.400 కోట్ల లగ్జరీ ప్యాలెస్ ఇదే.. దీనికి, హైదరాబాద్ కి లింక్ ఏంటంటే..