Suicide : రైలు ముందు దూకి వివాహిత, ప్రియుడి ఆత్మహత్య

వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు....

Train

Suicide : వివాహిత, ఆమె ప్రియుడు రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవారి జిల్లాలోని నంగల్ పఠానీ గ్రామ సమీపంలో మంగళవారం ఇద్దరు ప్రేమికులు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) సంఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఝజ్జర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Income Tax raids : విద్యుత్ బోర్డు అధికారులు, కాంట్రాక్టర్ల ఇళ్లలో ఐటీ దాడులు

మహిళకు మరో వ్యక్తితో వివాహమైందని సీనియర్ జీఆర్పీ అధికారి తెలిపారు. (Married Woman, Her Lover Die By Suicide) ఈ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసిందని అధికారి తెలిపారు. సోమవారం రాత్రి ఇద్దరు ఇళ్ల నుంచి కనిపించకుండా పోయారని తెలిపారు.

Former Pak PM Nawaz Sharif : పాక్ డబ్బుల కోసం అడుక్కుంటోంది…మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

మంగళవారం ఉదయం నంగల్ పఠానీ గ్రామ సమీపంలో భివానీ-మథుర ప్యాసింజర్ రైలు ముందు దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీకి సమాచారం అందింది. జీఆర్పీ మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇష్టం లేని పెళ్లి చేశారని వివాహిత ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు.