Former Pak PM Nawaz Sharif : పాక్ డబ్బుల కోసం అడుక్కుంటోంది…మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్థిక సంక్షోభానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ స్పైమాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆయన ఆరోపించారు....

Former Pak PM Nawaz Sharif : పాక్ డబ్బుల కోసం అడుక్కుంటోంది…మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

Former Pak PM Nawaz Sharif

Updated On : September 20, 2023 / 11:05 AM IST

Former Pak PM Nawaz Sharif : పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్థిక సంక్షోభానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ స్పైమాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆయన ఆరోపించారు. పొరుగు దేశం భారత్ చంద్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపించడంతోపాటు జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించగా, తమ పాకిస్థాన్ దేశం ప్రపంచాన్ని అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. (begging for funds laments)

IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం…ప్రయాణికుల కలకలం

ఆర్థిక ఇబ్బందులకు ఆ దేశ మాజీ జనరల్‌లు, న్యాయమూర్తులు కారణమని ఆయన పేర్కొన్నారు. (Former Pak PM Nawaz Sharif) ‘‘భారత్ చేసిన ఘనతలను పాకిస్తాన్ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి ఇక్కడ బాధ్యులెవరు?’’ అని ఆయన ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం లండన్ నుంచి వీడియో లింక్ ద్వారా లాహోర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trains Cancelled : కుర్మీల బంద్ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో 20 రైళ్ల రద్దు…47 రైళ్ల దారి మళ్లింపు

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత అనేక సంవత్సరాలుగా పతనం దిశలో ఉందని, అదుపు చేయని ద్రవ్యోల్బణం వల్ల పేద ప్రజలపై చెప్పలేని భారం పడుతుందని ఆయన చెప్పారు. నవాజ్ షరీఫ్ భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బీజింగ్, అరబ్ దేశాల రాజధానులకు వెళ్లి గిన్నెతో అడుక్కోవాల్సి వచ్చిందని ఆయన ఎత్తి చూపారు.

Telangana Elections : తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్టే.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎలక్షన్స్!

పాకిస్థాన్ అప్పులు తీర్చలేని స్థితిలో ఉండటం విచారకరమని ఆయన అన్నారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019 నుంచి నవాజ్ షరీఫ్ లండన్‌లో స్వయం ప్రవాస ప్రవాసంలో ఉన్నారు.