కరోనా మృతదేహాలను పూడ్చి పెట్టే అంబులెన్స్, మనుషుల అవసరం లేదు

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. రోజు రోజుకి లక్షల్లో కొత్త కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు ఎవరు ఏ కారణంతో చనిపోయినా కరోనా సోకిందేమోనని దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల దగ్గరకు రావాలంటే సొంత కుటుంబసభ్యులు కూడా వెనకాడుతున్నారు. ఆ మృతదేహాన్ని ముట్టుకుంటే ఎక్కడ తమకు కరోనా వస్తుందో అని భయంతో శవాలను మోసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతేకాదు అంత్యక్రియలకు జనాలు అడ్డుపడుతున్నారు.

మనుషుల అవసరం లేకుండానే అంత్యక్రియలు:
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, రోబోట్స్ కంపెనీలు కలిసి ఓ అంబులెన్స్ ను రూపొందించాయి. ఈ అంబులెన్స్ మనుషుల అవసరం లేకుండానే మృతదేహాన్ని తీసుకెళ్ళి గోతిలో పెడుతుంది. ఈ రెస్క్యూయర్ అంబులెన్స్ కరోనాతో మరణించిన వారి మృతదేహాలను గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడానికి తోడ్పడుతుందని మోటో కంపెనీల సీఈవో యాస్మిన్ జవహర్ తెలిపారు.

Read:మానవత్వం చచ్చింది.. 18 హాస్పిటళ్లు తిరిగినా ప్రాణం దక్కలేదు