Meenakshi Natarajan: బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి.. సొంతపార్టీ నేతల జోక్యం.. మీనాక్షి నటరాజన్ సీరియస్ కామెంట్స్
రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Meenakshi Natarajan makes shocking comments about BJP party.
- రాజ్యసభ నామినేషన్ కుట్రపూరితంగా తిరస్కరణ.
- లీగల్ నోటీసుల ఆరోపణలు ముమ్మాటికీ అబద్ధం.
- బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం ఖాయం.
Meenakshi Natarajan: రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై కుట్రపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించాయని ఆమె ధ్వజమెత్తారు. తన రాజ్యసభ సీటును అక్రమంగా చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు.
Ktr: రేవంత్ రెడ్డి సినిమా వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
సాంకేతిక కారణాల సాకు:
నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చాననే వార్తలపై మీనాక్షి స్పష్టతనిచ్చారు. తనపై ఎలాంటి లీగల్ కేసులు లేవని, అసలు నామినేషన్ పత్రంలో ‘లీగల్ నోటీస్’కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఎక్కడా లేదని పేర్కొన్నారు. లేని కాలమ్‌ను సాకుగా చూపి, సాంకేతిక కారణాల పేరుతో నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ అబద్ధాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.
సొంత పార్టీ ప్రమేయం లేదు:
ఈ తిరస్కరణ వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందనే పుకార్లను ఆమె తోసిపుచ్చారు. తమ పార్టీ అంతా ఏకతాటిపైనే ఉందని, ఇదంతా పూర్తిగా బీజేపీ ఆడిన నాటకమేనని స్పష్టం చేశారు. కేంద్ర ఒత్తిడికి లొంగి ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చట్టబద్ధంగా దక్కాల్సిన స్థానాన్ని కుతంత్రాలతో లాక్కున్నారని, బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ప్రజా మద్దతుతో తన పోరాటం కొనసాగుతుందని మీనాక్షి నటరాజన్ తేల్చిచెప్పారు.
