Rashmi Thackeray : ఉద్దవ్ భార్యపై ట్వీట్..బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు అరెస్ట్

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై వివాదాస్పద ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని జితెన్

Rashmi Thackeray : ఉద్దవ్ భార్యపై ట్వీట్..బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు అరెస్ట్

Uddhav Family

Updated On : January 6, 2022 / 8:55 PM IST

Rashmi Thackeray : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై వివాదాస్పద ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని జితెన్ గజారియాగా గుర్తించారు. జితెన్..బీజేపీ ఐటీ సెల్ విభాగానికి చెందిన వ్యక్తిన అని పోలీసులు తెలిపారు.

కాగా, ఈ నెల 4 జితెన్ గజారియాగా ట్విట్టర్ లో రష్మి థాకరే ఫొటోని షేర్ చేసి ‘మరాఠీ రబ్రీ దేవి’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి అనుబంధంగా ‘బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుంభకోణంలో ఇరుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవిని రబ్రీదేవి చేపట్టారు. ఇక్కడి పరిస్థితి ఇలాగే ఉంది. ఉద్ధవ్ థాకరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏమో సీఎం భార్య మరో రబ్రీదేవి కావొచ్చు’ అంటూ రాసుకొచ్చాడు.

ALSO READ Chandrababu: పవన్ కళ్యాణ్‌తో పొత్తుపై చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ!