నోబెల్ బహుమతి ఇవ్వాలని హౌరా బ్రిడ్జి ఎక్కిన మహిళ

  • Published By: venkaiahnaidu ,Published On : June 8, 2020 / 11:16 AM IST
నోబెల్ బహుమతి ఇవ్వాలని హౌరా బ్రిడ్జి ఎక్కిన మహిళ

Updated On : June 8, 2020 / 11:16 AM IST

కోల్ కతాలోని వరల్డ్ ఫేమస్ హౌరా బ్రిడ్జి దగ్గర ఆదివారం సాయంత్రం ఓ హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. అక్కడి నదిపై ఉన్న హౌరా బ్రిడ్జి నాలుగో స్తంభంపైకి ఓ యువతి ఎక్కింది. తన చిన్నతనంలో తన దగ్గర నుంచి నోబెల్ బహుమతి దొంగలించబడిందని,ప్రస్తుతం అది అమర్త్యసేన్ దగ్గర ఉందని తన నోబెల్ అవార్డు తనకు తిరిగి ఇవ్వకపోతే గంగానదిలో దూకేస్తా అంటూ బెదిరించింది.

అయితే అటుగా వెళ్లే కొందరు ఆమె మాట్లాడుతుందో అర్థం కాక….సూసైడ్ చేసుకుంటుందేమోనని భావించి పోలీసులకు ఫోన్ చేశారు. ఇక్కడ ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమైంది అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కోల్ కతా పోలీసులు క్షణాల్లో స్పాట్ కు చేరుకున్నారు. వచ్చీ రాగానే యువతిని చూసి దూకొద్దని బతిమలాడుతూ కాల్ చేసిన స్థానికుల్ని ఆ యువతిఎందుకు దూకాలనుకుంటోంది అని అడగగా…ఆమె చెప్పేది మాకేం అర్థం కావట్లేదు సార్ అని వాళ్లు జవాబిచ్చారు.

దాంతో కారణమేంటో ఆ యువతినే అడిగి తెలుసుకుని,ఆమెను కిందకు దించాలని పోలీసులు రెడీ అయ్యారు. మీరు దయచేసి కిందకు దిగండి. అసలు మీ సమస్యేంటో చెప్పండి. మేం పరిష్కారం చూపుతాం అని పోలీసులు అనడంతో… కచ్చితంగా పరిష్కరిస్తారా అని ఆ యువతి అడిగింది. అయితే పోలీసులు ఏదో ఫ్యామిలీ మేటర్ అయివుంటుంది… కౌన్సెలింగ్ ఇద్దామనకుంటూ తప్పకుండా పరిష్కరిస్తాం అన్నారు.తన చిన్నతనంలో తన దగ్గర నుంచి నోబెల్ బహుమతి దొంగలించబడిందని, తన నోబెల్ అవార్డు తనకు తిరిగి ఇవ్వకపోతే గంగానదిలో దూకేస్తా అంటూ పోలీసులకు యువతి చుక్కలు చూపించింది.

ఏ నోబెల్ బహుమతి అని పోలీసులు అడుగగా…ఇప్పుడు ఆర్ధికవేత్త అమర్త్యసేన్‌ (ఇండియా నుంచి అధికారిక నోబెల్ బహుమతి గ్రహీత)కి ఇచ్చింది తనదేనని, చిన్నప్పుడు తన దగ్గర దొంగిలించిందే ఆయనకు ఇచ్చారని ఆ యువతి పోలీసులకు జవాబు ఇచ్చింది. ఇంతలో ఫైర్ సిబ్బంది వచ్చారు. పోలీసులు వాళ్లకు మేటర్ చెప్పారు. అది విన్న వాళ్లు షాకింగ్ ఫేస్ పెట్టారు. నోబెల్ బహుమతా అంటూ నోరెళ్లబెట్టారు.

ఆమె మరిన్ని డిమాండ్లు మొదలుపెట్టింది. ఏవేవో కావాలని అడగసాగింది. నోబెల్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు లెటర్లు రాసినా పట్టించుకోవటలేదని తెలిపింది. అప్పుడు పోలీసులకు మేటర్ అర్థమైంది. ఆమె మానసిక స్థితి బాలేదని గుర్తించారు. ఆమెను దింపేందుకు పైకి ఎక్కితే… ఆమె ఆలోపే కిందకు దూకేస్తే ఎలా అని వాళ్లు ఆలోచించారు. చివరకు పోలీసులు ఆమెను మాటల్లో పెట్టి… నోబెల్ ప్రైజ్ తిరిగి ఇప్పిస్తామని పదే పదే బతిమలాడటంతో ఆమెను కిందకు దిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అశోక్‌నగర్ నివాసి అయిన ఆమె పేరు డొల్లీ ఘోష్ గా పోలీసులు గుర్తించారు.

Read: ఢిల్లీలో మరోసారి భూకంపం