కరోనాపై యుద్ధం : జన్ ధన్ ఖాతాలోకి నగదు , రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు

  • Publish Date - March 26, 2020 / 07:38 AM IST

కరోనాపై భారత్ యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చర్యల వల్ల పలు రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో..మరిన్న చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. స్టిములస్ ప్యాకేజీని రెడీ చేయడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇది అమలు చేస్తేనే బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2020, మార్చి 26వ తేదీ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

కరోనా కోరల్లో చిక్కున్న భారత్ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రకటన ఉంటుందని సమాచారం. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారా ? అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షన్నర కోట్ల వరకు ప్యాకేజీ రెడీ చేస్తారని టాక్. ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పేదలతో పాటు పారిశ్రామిక రంగానికి ప్యాకేజీ ఇస్తారని సమాచారం. 

స్టిములస్ ప్యాకేజీతో వెంటిలెటర్లు, ఇంటెన్సివ్ కేర్ బెడ్లను కొనుగోలు చేయనుంది. కరోనా వైరస్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, వెంటనే ఏదైనా ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

కోవిడ్ – 19 (కరోనా) భారత్ పై పంజా విసురుతోంది. ఎన్నో కేసులు రికార్డవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో ఇద్దరు చనిపోవడంతో ఈ సంఖ్య 14కి చేరుకుంది. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో..
ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కూలీ, నాలి చేసుకొనే వారు, కార్మికులు, నిరుద్యోగులు..ఇలా ప్రతొక్కరిపై ప్రభావం చూపుతోంది. కూలీలు, కార్మికులు, సామాన్య మానవుడి పరిస్థితి చెప్పనవసరం లేదు. పనులు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 

Also Read | పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ