ఒడిశాలో..బాలికపై గ్యాంగ్ రేప్, నిందితులంతా తల్లి సహచర ఉద్యోగులే!

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 08:05 AM IST
ఒడిశాలో..బాలికపై గ్యాంగ్ రేప్, నిందితులంతా తల్లి సహచర ఉద్యోగులే!

Updated On : September 7, 2020 / 9:51 AM IST

ఒడిశాలోని భువనేశ్వర్ లో లాక్ డౌన్ వేళ 13 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన ప్రకంపనలు రేకత్తిస్తోంది. బాలిక తల్లి పని చేస్తున్న ఓ మీడియా సంస్థలోని సహచర ఉద్యోగులు అత్యాచారం జరిపారు. వీరే కాకుండా..సెక్యూర్టీ గార్డులు, పోలీసులు కూడా ఉన్న విషయం బయటపడింది.
https://10tv.in/minor-gangraped-by-8-in-odisha-cops-media-persons/
మార్చి – ఏప్రిల్ నెలలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు బయటపడింది.
కరోనా కారణంగా..దేశంలో కేంద్రం లాక్ డౌన్ విధించింది. భువనేశ్వర్ లో 13 ఏళ్ల బాలిక తల్లి..ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా..గంటల తరబడి ఆఫీసులో ఉండిపోయేది. బాలిక తండ్రి, ఇతర కుటుంబసభ్యులు 85 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేంద్రపరలో నివాసం ఉంటున్నారు.




తల్లి పనిచేస్తున్న కార్యాలయంలోని తోటి ఉద్యోగులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీళ్లతో పాటు, ఒక పోలీసు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, మరో ఇద్దరు వ్యక్తులు కూడా అకృత్యానికి తెగబడ్డారు. ఎక్కడా విషయం చెబితే చంపేస్తామని తీవ్రమైన బెదిరింపులకు దిగారు.

దీంతో బాలిక బయపడిపోయింది. చివరకు బాలిక..జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. సహచర ఉద్యోగులను ప్రశ్నిస్తే..ఆమెను బెదిరించారు. ఆగస్టులో నగరానికి చేరుకున్న ఆమె..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.