ఎక్కడున్నావమ్మా : హైదరాబాద్ ATMల్లో రూ.2వేల నోటు మిస్సింగ్

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల  నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 06:21 AM IST
ఎక్కడున్నావమ్మా : హైదరాబాద్ ATMల్లో రూ.2వేల నోటు మిస్సింగ్

Updated On : April 4, 2019 / 6:21 AM IST

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల  నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల  నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు. వచ్చినా.. ఒకటీ, అరానే. ATMలో డ్రా చేస్తే రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. ఈ పెద్ద నోటు ఎక్కడికి పోయింది?  పింక్ కలర్ లో ముచ్చటగా కనిపించే ఈ నోట్.. కొన్నిరోజులుగా కనిపించకపోవడంతో అందరిలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద నోటు కనిపించకపోవడానికి కారణం ఎన్నికలే అనే మాటే వినిపిస్తోంది. 
Read Also : ప్రపంచం మెచ్చింది : నా కోడిపిల్లను కాపాడండీ.. పాకెట్ మనీతో ఆస్పత్రికి పరిగెత్తిన బుడతడు

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రెండువేల నోటు మాయమైపోయింది. రాజకీయ పార్టీల నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు 2వేల నోట్లు దాచేసుకున్నారని వాదన వినిపిస్తోంది. అందుకే హైదరాబాద్‌ నగరంలో కూడా  ATMల్లో పెద్ద నోట్లు ఏ మాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఇదే సమయంలో పోలీసులు పట్టుకుంటున్న డబ్బులో కూడా ఎక్కువ మొత్తం 2వేల నోట్లే కనిపిస్తుండటం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. 

2018, మార్చిలో దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీలో సగానికి పైగా ఉన్న రూ. 2 వేల నోట్లు, ఈ సంవత్సరం మార్చికి వచ్చే సరికి 37.3 శాతానికి తగ్గింది. RBI వెల్లడించిన డేటా ప్రకారం మార్చి 2017 నాటికి మొత్తం 3వేల 285 మిలియన్లు, మార్చి 2018 నాటికి 3వేల 363 మిలియన్ల రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. 
 

కొన్ని నెలలుగా బ్యాంక్ ఉద్యోగులు 2వేల నోట్లు బ్యాంకులకు రావటంలేదంటున్నారు బ్యాంక్ సిబ్బంది. RBI కూడా రూ. 2వేల నోట్లను సరఫరా చేయటం లేదు. దీంతో ఈ నోట్ల కొరత బ్యాంకులలో ఏర్పడిందని తెలిపారు.
Read Also : నేటికి 46ఏళ్లు : ఫస్ట్ మొబైల్ ఫోన్ కాల్ ఎవరు, ఎవరికి చేశారో తెలుసా?