MoC Accounts : మదర్ థెరిసా మిషనరీల అకౌంట్లు ఫ్రీజ్..మమత ఆరోపణలకు కేంద్రం కౌంటర్
దేశంలో మదర్ థెరిసా మిషనరీ ఆఫ్ ఛారిటీ(MoC)ల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ

Mamata Moh
MoC Accounts : దేశంలో మదర్ థెరిసా మిషనరీ ఆఫ్ ఛారిటీ(MoC)ల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్మస్ రోజున కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ స్పందించింది. సోమవారం కేంద్రహోంశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో…”ఎంవోసీ యెక్క ఏ ఒక్క బ్యాంక్ అకౌంట్ ని హోంశాఖ నిలిపివేయలేదు. ఎంవోసీనే స్వయంగా తమ అకౌంట్లను నిలిపివేయాలంటూ ఎస్బీఐని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ..ఆ ఖాతాలను ఫ్రీజ్ చేసింది”అని మమత ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ.
కాగా,FCRA 2010,FCRR 2011 అర్హత నిబంధలకు అనుగుణంగా లేవన్న కారణంతో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద.. MoC చేసుకున్న రెన్యువల్ అప్లికేషన్ డిసెంబర్-25న తిరస్కరణకు గురైందని ప్రెస్ నోట్ లో భారత ప్రభుత్వం తెలిపింది. పునరుద్దరణ అప్లికేషన్ తిరస్కరణను రివ్యూ చేయాలని MoC నుంచి ఎలాంటి అభ్యర్థణ లేదని తెలిపింది. MoC యొక్క FCRA రిజిస్ట్రేషన్ వాలిడిటీ డిసెంబర్-31,2021 వరకు ఉందని తెలిపింది.
అయితే,సోమవారం మధ్యాహ్నాం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఓ ట్వీట్ లో…”మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందనే వార్తను క్రిస్మస్ రోజున వినటం దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో వాటిల్లోని 22వేల మంది రోగులు, ఉద్యోగులు. ఔషధాలు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ప్రధానమైనప్పటికీ, మానవతా ప్రయత్నాలలో ఎలాంటి రాజీ ఉండకూడదు”అని పేర్కొన్నారు. ఇక,ఈ విషయంపై కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ కార్యాలయం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ALSO READ India vs South Africa 1st Test : వర్షార్పణం..తొలి టెస్టు రెండో రోజు ఆట రద్దు