Mizoram Counting : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్‌పీఎం ఘన విజయం

మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సహా పులువురు మంత్రులు ఓడిపోయారు. 

Mizoram Counting : మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జెడ్‌పీఎం ఘన విజయం

Mizoram Counting

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాల్లో జోరాం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సహా పులువురు మంత్రులు ఓడిపోయారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 04 Dec 2023 05:13 PM (IST)

    మిజోరాం తుది ఫలితాలు ఇవే

    మిజోరాం అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎన్నికల్లో జోరాం పీపుల్స్ మూమెంట్ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాగా, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఓటమి పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావం ఏమాత్రం పని చేయలేదు. బీజేపీ, కాంగ్రెస్ లు కనిష్ట సంఖ్యకు పడిపోయాయి
    పార్టీల వారీగా సీట్ల వివరాలు
    మొత్తం సీట్లు - 40, మేజిక్ ఫిగర్ - 21
    జెడ్‌పీఎం - 27
    ఎంఎన్ఎఫ్ - 10
    బీజేపీ - 2
    కాంగ్రెస్ - 1

  • 04 Dec 2023 03:11 PM (IST)

    ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, జోరాం పీపుల్స్ మూమెంట్ ఇప్పటివరకు 26 స్థానాల్లో విజయం సాధించగా, మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఎంఎన్‌ఎఫ్‌ 7 స్థానాల్లో గెలుపొందగా, 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు 35 సీట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. మిజోరాంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.

  • 04 Dec 2023 03:10 PM (IST)

    ముఖ్యమంత్రి ఓడిపోయారు

    మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి దారుణ ఓటమి పాలయ్యారు. ఆయన మీద జోరాం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థి లాల్తన్‌సంగా విజయం సాధించారు. 2,101 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.

  • 04 Dec 2023 12:15 PM (IST)

    మిజోరంలో అధికారంవైపు దూసుకెళ్తున్న జెడ్‌పీఎం ..

    మిజోరం ఎన్నికల ఫలితాల్లో జడ్పీఎం హవా కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన తొమ్మిది మంది విజయం సాధించగా.. మరో 17 మంది ఎమ్మెల్యేలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎంఎన్ఎఫ్ పార్టీ నుంచి ఒకరు విజయం సాధించగా.. 10 మంది ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి ఒకరు విజయం సాధించగా.. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Dec 2023 10:22 AM (IST)

    మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో టుయిచాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ZPM అభ్యర్థి డబ్ల్యూ చువాన్వామా విజయం సాధించారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిశాక 909 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 04 Dec 2023 10:09 AM (IST)

    ZPM ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహోమా సెర్చిప్ నుండి మొత్తం 1992 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Dec 2023 10:07 AM (IST)

    మిజోరం ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (ZPM) పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) 10 చోట్ల ముందంజలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 04 Dec 2023 08:33 AM (IST)

    మిజోరం అసెంబ్లీలోని 40 స్థానాలకు గాను మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • 04 Dec 2023 08:31 AM (IST)

    కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది

  • 04 Dec 2023 08:28 AM (IST)

    మిజోరంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2750 మంది అధికారులు ఓట్ల లెక్కింపులో నిమగ్నమయ్యారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమైంది.

  • 04 Dec 2023 08:27 AM (IST)

    కౌంటింగ్ ప్రక్రియలో 4,000 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. మొత్తంగా ఈవీఎంల కోసం 399 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.

  • 04 Dec 2023 08:26 AM (IST)

    40 సీట్లున్న మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రధానంగా అధికార ఎంఎన్‌ఎఫ్‌తో పాటు జడ్‌పీఎం, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడ్డాయి. దీంతో ఈసారి ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారన్నది ఆసక్తి రేపుతోంది.