Kavitha Kalvakuntla : మహిళల నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్

స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రాజ్యసభలో మహిళల రుతుక్రమంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యల పట్ల నిరుత్సాహానికి గురయ్యానని తెలిపారు.

Kavitha Kalvakuntla : మహిళల నెలసరి సెలవులపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్

Kavitha Kalvakuntla

Updated On : December 15, 2023 / 10:44 AM IST

Minister Smriti lrani : మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మతిఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ట్విటర్ వేదికగా స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇస్తూ.. మహిళల్లో నెలసరి అనేది వైకల్యం కాదు.. అదొక సహజ ప్రక్రియ. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారి తీయొచ్చుఅని ఆమె అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు.

Also Read : Heavy security : పార్లమెంట్ వద్ద భారీ భద్రత, ఎంపీల సస్పెన్షన్‌పై గందరగోళం

స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. రాజ్యసభలో మహిళల రుతుక్రమంపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యల పట్ల నిరుత్సాహానికి గురయ్యానని తెలిపారు. ఒక మహిళగా అలాంటి అజ్ఞానాన్ని చూడటం చాలా భయంకరంగా ఉందని పేర్కొన్నారు. రుతుస్త్రావం ఎంపిక కాదు.. అది జీవన వాస్తవికత.. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాక మహిళలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లవుతుందని అన్నారు. ఒక మహిళగా, మహిళలు ఎదుర్కొనే నిజమైన సవాళ్లు, ప్రతిదానికీ మనం ఎదుర్కోవాల్సిన పోరాటం పట్ల సానుభూతి లేకపోవటం విస్తుగొలిపే విషయం అని కవిత ట్వీట్ లో పేర్కొన్నారు.

 

+