Upchaar Mobile App : కరోనా బాధితుల కోసం కొత్త మొబైల్ యాప్..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులు సులభంగా వైద్యులను సంప్రదించేందుకు కొత్త మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు.

Mobile App Launched To Help Covid Patients In Noida
Upchaar Mobile App : కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా బాధితులు సులభంగా వైద్యులను సంప్రదించేందుకు కొత్త మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో ఈ యాప్ ప్రారంభించారు. మెడికల్ సైన్సెస్ గవర్నమెంట్ ఇన్సిస్ట్యూట్ (GIMS) నుంచి సహకారంతో ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఉపచార్ యాప్ రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది. నాసిక్ ఆధారిత గన్వంత్ బాటేస్ యాప్ డెవలప్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ యాప్.. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఐఓఎస్ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
మహమ్మారి కరోనా రెండో వేవ్ సమయంలో కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చికిత్స కోసం తీసుకెళ్లలేకపోయామని, ఎమ్మెల్యే సింగ్ అన్నారు. వైద్యులతో సంప్రదించే పరిస్థితులు లేక సాధ్యపడలేదని తెలిపారు. మొబైల్ యాప్ ఫీచర్ల వివరాలను వివరించారు. గౌతమ్ బుద్ధ నగర్‌లో ఎవరైనా తమ మొబైల్ నెంబర్ ఉపయోగించి యాప్‌లో తమను తాము నమోదు చేసుకోవచ్చునని అన్నారు.
వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ఉంటుందని చెప్పారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ గ్రామీణ ప్రాంత ప్రజలకు సాయం అందించనుంది. కరోనా బాధితుల కోసం మరింత సాయాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు.