SM Krishna: ఎస్ఎం కృష్ణ మృతిపట్ల మోదీ, చంద్రబాబు సంతాపం.. గతంలో ఫొటోలను షేర్ చేసిన ప్రధాని

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.

PM Modi

SM Krishna Passed Away: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్నుమూశారు. కొద్దికాలంగా వృద్ధాప్యం రిత్యా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా.. మంగళవారం తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎం కృష్ణ 1999 – 2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. యూపీఏ హయాంలో 2009- 2012 మధ్య విదేశాంగ మంత్రిగానూ ఎస్ఎం కృష్ణ పనిచేశారు. దాదాపు 50ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్ఎం కృష్ణ.. 2017లో బీజేపీలో చేరారు. గతేడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా.. ఎస్ఎం కృష్ణ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Also Read: Manchu Manoj : మంచు వివాదం.. సంచలన నిజాలు బయటపెట్టిన మనోజ్.. అసలేం జరిగిందంటే..

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అసాధారణ నేత. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారు. కర్ణాటక సీఎంగా ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ శ్రద్ద చూపేవారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉ్నారని ప్రధాని మోదీ కొనియాడారు.


Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు

ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్ఎం కృష్ణ మరణ వార్త బాధించిందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో స్నేహపూర్వకంగా పోటీపడేవాళ్లం అని కృష్ణతో గత అనుభవాలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నిజమైన నాయకుడు ఎస్ఎం కృష్ణ. కష్ట సమయంలో ఆయన కటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.