మోడీకి రాహుల్ సవాల్ : దమ్ముంటే 10 నిమిషాలు చర్చకు రా

  • Published By: veegamteam ,Published On : February 7, 2019 / 09:36 AM IST
మోడీకి రాహుల్ సవాల్ : దమ్ముంటే 10 నిమిషాలు చర్చకు రా

Updated On : February 7, 2019 / 9:36 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరావేశం చూపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోని పరిస్థితులపై దమ్ముంటే చర్చకు రావాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు. జస్ట్ 10 నిమిషాలు నాతోపాటు ఒకే వేదికపై మోడీ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గతంలోనూ చర్చకు సవాల్ చేశానని.. మోడీ మాత్రం పిరికివాడిగా పారిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు. మోడీని పిరికివాడిగా అభివర్ణిస్తూ.. స్టేజ్ పైనే వెనక్కి నడుస్తూ అతని హావభావాలను ప్రదర్శించారు రాహుల్ గాంధీ. దీంతో సమావేశం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై చర్చించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని.. బీజేపీ లేదా మోడీ ఎవరు వచ్చినా చర్చకు సిద్ధం అని ప్రకటించారు.

 

56-ఇంచ్ గుండె అంటూ రొమ్ము విరుచుకుని తిరిగే మోడీ.. చర్చకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు రాహుల్. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం, దమ్ము మోడీ దగ్గర లేవని.. ఓ పిరికివాడు అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలనూ ప్రస్తావించారు. రైతులు, పేదలకు కనీస ఆదాయం కల్పించే విధంగా పథకం రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.