Engineers Day 2023 : ఈరోజు ఇంజనీర్స్ డే.. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవల్ని స్మరిద్దాం

ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ ఆయన. ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఏటా ఇంజనీర్స్ డే నిర్వహిస్తారు.

Engineers Day 2023 : ఈరోజు ఇంజనీర్స్ డే.. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవల్ని స్మరిద్దాం

Engineers Day 2023

Updated On : September 15, 2023 / 12:52 PM IST

Engineers Day 2023 : ఆయన భారతదేశపు గర్వించదగ్గ ఇంజనీరు, రాజనీతిజ్ఞుడు, మైసూరు సంస్థానంలో దివానుగా పనిచేసారు. ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈరోజు ఆయన జయంతి. ఏటా ఆయన పుట్టినరోజును ‘ఇంజనీర్స్ డే’గా జరుపుకుంటాం. ఈ సందర్భంలో ఆయన సేవల్ని గుర్తు చేసుకుందాం.

Madhya Pradesh : 57 కిలోల బరువున్న ‘సంవిధాన్ సే దేశ్’ పుస్తకం ప్రత్యేకత ఏంటో తెలుసా?

మోక్షగుండం విశ్వేశ్వరయ్య శాస్త్ర,సాంకేతిక రంగంలో విశేషమైన సేవలు అందించారు. ఆయన జన్మదినోత్సవాన్ని భారతదేశం అంతటా ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుతారు. ఈ దినోత్సవాన్ని శ్రీలంక, టాంజానియాలలో కూడా జరుపుతారు.  మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. శ్రీనివాసశాస్ర్తి, వెంకటలక్ష్మమ్మలకు 1861 సెప్టెంబర్‌ 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య చిక్‌బల్లాపూర్‌ జరిగింది. విశ్వేశ్వరయ్య 15వ ఏళ్లలోనే తండ్రిని కోల్పోయారు. ఆ తరువాత విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్యే ఆయన్ని చదివించారు. 1880లో ఎంఏ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. విశ్వేశ్వరయ్య పూణేలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు.

బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది. ఆ తరువాత సంవత్సరం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు.  ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు. దీంతో సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేశారు విశ్వేశ్వరయ్య.  ఆ నది నీరు ఫిల్టర్ చేయటానికి ఒక వినూత్న విధానం రూపొందించారాయన.  నంబనది మీద సైఫన్‌ పద్ధతితో ఓ కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటో మేటిక్‌ గేట్లు నిర్మించి సమస్య తొలగించటంతో ఆయన ప్రతిభకు అందరు ఆశ్చర్యపోయారు. దీంతో 1909లో మైసూర్‌ ప్రభుత్వం ఆయనను చీఫ్‌ ఇంజనీర్‌‌గా నియమించింది.

Ankur Warikoo : సోషల్ మీడియాలో తన ‘ఫెయిల్యూర్ రెజ్యూమ్’ పంచుకున్న యూట్యూబర్, రచయిత అంకుర్ వారికూ

100 ఏళ్ల క్రితం హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థకు రూపశిల్పి కూడా విశ్వేశ్వరయ్యే. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ ఎల్‌ఎల్‌డి ఇచ్చి సత్కరించింది. బాంబే, కలకత్తా, బెనారస్‌, అలహాబాద్‌ తదితర యూనివర్శిటీలు డాక్టరేట్‌ పురస్కారాలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రధానం చేసి ఆయనను ఘనంగా సత్కరించింది.

విశ్వేశ్వరయ్య నీటిపారుదల పద్ధతులు, వరద నియంత్రణలో చేసిన కృషికి గుర్తింపు పొందారు. మైసూరులోని కృష్ణ రాజ సాగర ఆనకట్ట నిర్మాణం, సర్ ఎం విశ్వేశ్వరయ్య మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం , ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అనేక ఇతర సంస్థలను స్ధాపించారు.

Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా.. ఇంజనీరింగ్‌తో పనిలేదని నిరూపించిన డిగ్రీ స్టూడెంట్.. రూ. 50 లక్షల జీతం!

విశ్వేశ్వరయ్య 101 సంవత్సరాలు జీవించారు. 1962, ఏప్రిల్‌ 12న విశ్వేశ్వరయ్య క‌న్నుమూశారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్‌ 15వ తేదీన ఇంజనీర్స్‌ డేగా జరుపుకొంటున్నాం. ఇంజనీర్ల దినోత్సవం సందర్భంలో ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.