Delhi Airport
Delhi Airport : కోతులు చేసే చిలిపి పనులు ఆనందాన్ని కలిగిస్తాయి. వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు చిరాకు తెప్పిస్తాయి. అయితే తాజాగా ఓ కోతి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడింది. వీఐపీ లాంజ్ లోకి వచ్చి కూర్చుంది. అక్కడే ఓ రియల్ ఫ్రూట్ జ్యూస్ బాటిల్ కనిపించడంతో దాన్ని తాగేసింది. ఆ తర్వాత నాలుగు పల్లీ గింజలు నోట్లో వేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. లోపలికి వచ్చిన కోతిని చూసి కొందరు బయపడగా, మరికొందరు మాత్రం దాని చేష్టలు చూసి నవ్వుకున్నారు. చుట్టూ జనం ఉన్నా ఏ మాత్రం భయం లేకుండా డ్రింక్ మొత్తం తాగేసింది. ఇక అక్కడ ఉన్నవారు దీనిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది.
Read More : Donald Trump : తాలిబన్ కు ఉన్న హక్కు నాకు లేదా..కోర్టుకెక్కిన ట్రంప్
ఇక దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీ బ్లడీ సమస్య ఏంటి అందరు నన్నే చూస్తున్నారు.. ఏదైనా పెట్టండి తిని పెడతా అని ఒకరంటే, విఐపీలు మీరేనా నేను కదా! వింతగా చుస్తున్నారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన IGI విమానాశ్రయంలో జరిగినట్లు విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి, అయితే, సంఘటన తేదీ మరియు సమయం ఇంకా నిర్ధారించబడలేదు.
Read More : Mercks Pill : ఈ ట్యాబ్లెట్‌తో కరోనాకు చెక్.. మరణాల ముప్పు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం సగానికి తగ్గుదల..!
మరొక సంఘటనలో, ఒక కోతి జూన్‌లో ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల ప్రయాణించింది. రైలు యమునా బ్యాంక్ నుండి బ్లూ లైన్‌లోని ఐపి మెట్రో స్టేషన్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మెట్రో అద్దం వద్ద నిలబడి సిటీ అందాలను తిలకించింది. ఐపి స్టేషన్ రాగానే దిగి వెళ్ళిపోయింది.