Uttar Pradesh : ఆహారం పెట్టి ఆదరించిన వ్యక్తి మృతి.. మృతదేహం వెంట 40 కిలోమీటర్లు ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గొన్న కోతి

అయితే రోజు లాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి.. విగతజీవిగా పడి ఉన్న అతడిని చూసి తట్టుకోలేకపోయింది. మృతదేహం దగ్గరకు చేరుకుని విలపించింది.

Uttar Pradesh : ఆహారం పెట్టి ఆదరించిన వ్యక్తి మృతి.. మృతదేహం వెంట 40 కిలోమీటర్లు ప్రయాణించి అంత్యక్రియల్లో పాల్గొన్న కోతి

monkey participate man funeral rites

Updated On : October 14, 2023 / 6:14 PM IST

Uttar Pradesh – Monkey Participate Man Funeral Rites : పెంపుడు జంతువులు ఎప్పుడు కూడా విశ్వసనీయతను కోల్పోవు. వాటికి కొంత ఆహారం పెట్టి ఆదరిస్తే అవి ఎప్పటికీ విశ్వాసాన్ని తప్పవు. యజమాని వెన్నంటే ఉంటాయి. ప్రతి రోజూ ఆహారం పెట్టి ఆదరించిన వ్యక్తి మరణాన్ని ఓ కోతి తట్టుకోలేకపోయింది. అతని మృతదేహం దగ్గర రోధించింది. మృతదేహం వెన్నంటే 40 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆ వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రెహా జిల్లాలో చోటు చేసుకుంది. రామ్ కున్వర్ సింగ్ అనే వ్యక్తి ప్రతి రోజు ఒక కోతికి ఆహారం అందిస్తూ ఆదరించేవాడు. రొట్టెలు, పండ్లు, ఇతర ఆహార పధార్థాలు ఆ కోతికి ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి, కోతి మధ్య స్నేహం పెరిగింది. రోజులో కొంత సమయం ఆ కోతి అతడితో ఆడుతూవుండేది. కాగా, మంగళవారం రామ్ కున్వర్ సింగ్ మృతి చెందారు.

Viral Video: గోల్డ్ ఫిష్‌ ప్రాణాలు కాపాడిన కుక్క.. అబ్బురపరుస్తున్న వీడియో

అయితే రోజు లాగే ఆహారం కోసం అక్కడకు వచ్చిన కోతి.. విగతజీవిగా పడి ఉన్న అతడిని చూసి తట్టుకోలేకపోయింది. మృతదేహం దగ్గరకు చేరుకుని విలపించింది. అంతేకాకుండా రామ్ కున్వర్ అంతిమయాత్రతోపాటు 40 కిలోమీటర్ల దూరంలో నిర్వహించిన అంత్యక్రియల్లో కూడా పాల్గొంది. అతడి మృతదేహాన్ని వీడలేక విలపించింది.

ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందిత. ఆహారం పెట్టే వ్యక్తి మృతిని కోతి తట్టుకోలేకపోవడం, అతడి మృతదేహాన్ని వెన్నంటి ఉండి రోధించడం చూసి నెటిజన్లు చలించిపోయారు. కోతి, వ్యక్తి మధ్య ఉన్న అనుబంధాన్ని కొంతమంది కొనియాడారు.