Monsoon Session: జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారైంది. జులై 17న అఖిలపక్ష భేటీ నిర్వహించనుండగా 18వ తేదీ నుంచి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలకు అఖిలపక్ష సమావేశానికి రావాలని సమాచారం పంపింది.

Monsoon Session: జులై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Parliament Budget Session

Updated On : July 12, 2022 / 12:24 PM IST

 

 

Monsoon Session: అఖిలపక్ష సమావేశానికి తేదీ ఖరారైంది. జులై 17న అఖిలపక్ష భేటీ నిర్వహించనుండగా 18వ తేదీ నుంచి పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు ప్రారంభించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలకు అఖిలపక్ష సమావేశానికి రావాలని సమాచారం పంపింది.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. భేటీకి ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి హాజరవనున్నట్లు చెబుతున్నారు.

అఖిలపక్ష భేటీకి అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. జులై 17న సాయంత్రం ఎన్డీఏ పక్ష నేతలు భేటీ కానున్నారు.

Read Also: వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సర్కారు సిద్ధం

ఎన్డీఏ పక్ష నేతల భేటీకి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, ఇతర నేతలైన అనుప్రియా పటేల్‌, పశుపతి పరాస్‌‌లు హాజరుకానుండగా.. జేడీయూ నుంచి లాలన్‌ సింగ్‌, బీరేన్‌ వైశ్యతో సహా లోక్‌సభ, రాజ్యసభలోని పక్ష నేతలు పాల్గొంటారు.