Monsoon
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా స్తంభిస్తున్నాయి. పెగాసస్ హ్యాకింగ్, వ్యవసాయ చట్టాలు తదితర అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఉభయ సభల్లోనూ ఆందోళనతో హోరెత్తిస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టాయి. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం తిరిగి సభ ప్రారంభమైనా విపక్షాలు ఆందోళన విరమించకపోవడంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.
Read More : Nawaz Sharif కి బ్రిటన్ బిగ్ షాక్..తిరిగి లాహోర్ జైలుకి వెళ్లాల్సిందే!
విపక్షాల గందరగోళం :-
విపక్షాల గందరగోళం నడుమ లోక్‌సభలో రెండు బిల్లులు పాసయ్యాయి. టాక్సేషన్ లా సవరణ బిల్లు-2021, సెంట్రల్ యూనివర్సీటీస్-2021, బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. టాక్సేషన్ బిల్లుపై కేంద్రం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన రవికుమార్ దహియాకు పార్లమెంట్ శుభాకాంక్షలు తెలిపింది.
Read More : SSF Bank: సేవింగ్ అకౌంట్ తెరిస్తే చాలు.. రూ.25 లక్షల భీమా!
రాజ్యసభలో సేమ్ సీన్ :-
మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షపార్టీలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో విపక్షాల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. పెగాసస్‌పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాల సభ్యులు పోస్టర్లతో చైర్మన్ పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. పెగాసస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్షాలు హంగామా సృష్టించాయి. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు.