లాలూ కుటుంబంలో ఇంకా రగులుతోన్న చిచ్చు.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు

తమ పిల్లలను కూడా తీసుకెళ్లారు. లాలూకి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

లాలూ కుటుంబంలో ఇంకా రగులుతోన్న చిచ్చు.. ఇంటి నుంచి వెళ్లిపోయిన మరో ముగ్గురు కుమార్తెలు

lalu yadav family

Updated On : November 17, 2025 / 8:22 AM IST

Lalu Yadav: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో రేగిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పటికే లాలూ కూతురు రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పి, ఆ కుటుంబంతో సంబంధాలు కట్ చేసుకున్న విషయం తెలిసిందే.

విభేదాలు మరింత తీవ్రతరమై మరో ముగ్గురు కుమార్తెలు రాజలక్ష్మి, రాగిణి, చందా పట్నాలోని లాలూ 10 సర్క్యులర్ రోడ్‌లో ఉన్న ఇంటిని విడిచి వెళ్లిపోయారు. వారితో పాటు వారి పిల్లలను కూడా తీసుకెళ్లారు. (Lalu Yadav)

Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్క చలి పులి పంజా.. మరోపక్క వర్ష సూచన

కాగా, 1973 జూన్‌ 1న రబ్రీ దేవిని లాలూ వివాహం చేసుకున్నారు. వారికి 9 మంది సంతానం. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారి పేర్లు మీసా భారతి, రాగిణి యాదవ్, తేజ్‌ ప్రతాప్ యాదవ్, అనుష్క యాదవ్, చందా యాదవ్, రోహిణి యాదవ్, రాజలక్ష్మి యాదవ్, హేమ యాదవ్, తేజస్వీ యాదవ్.

కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య శనివారం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు, కుటుంబాన్ని విడిచిపెడుతున్నట్లు ప్రకటించింది. బిహార్ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్ పరాజయం, ఆర్‌జేడీ 25 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో ఆమె ఈ నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే తేజ్‌ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి లాలూ యాదవ్ బహిష్కరించారు.