Breast Milk: గంగా నది తీరంలో..చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్న మహిళలు..వారిపాలు తాగితే బిడ్డలకు అత్యంత ప్రమాదకం..!
గంగా నది తీరంలో..చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్నారు మహిళలు. వారి పాలు తాగితే బిడ్డలకు అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిస్తున్నారు.

Bihar Arsenic Mother Milk
Bihar Arsenic Mother Milk: అమ్మపాలు అమృతంతో సమానం..ప్రపంచంలో ఏదైనా కల్తీ అవుతుందేమో గానీ తల్లిపాలు మాత్రం కల్తీ అవ్వవు. అందుకే పుట్టిన శిశువుకి తల్లిపాలు మించిన ఆహారం మరొకటి లేదు..లేనేలేదని చెబుతుంటారు డాక్టర్లు. కానీ అటువంటి అమ్మపాలే బిడ్డలకు కాలకూట విషంలామారితే. ఇక ఆ బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటీ?తన పాలే తన బిడ్డలకు ప్రాణసంకటంగా..పాషాణంలా మారుతున్నాయని తెలిసిన ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితి మన భారత్ లోని అమ్మలకే వచ్చింది. బీహార్ (Bihar) రాష్ట్రంలో మహిళలు చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్నారు. వారి పాలు తాగిన బిడ్డల ఆరోగ్య పరిస్థిని ప్రమాదకరంగా మారుతోందని పరిశోధకులు తెలిపారు.ఇది అత్యంత దారుణమైన పరిస్థితిగా మారుతోంది.
ముఖ్యంగా గంగా నది(Ganga River) తీరంలో ఉన్న రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని తల్లుల పాలల్లో ఈ ఆర్సెనిక్ బయటంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బీహార్ లోని వైశాలి, పాట్నా, బక్సర్, భోజ్‌పుర్, సరన్, వైశాలి, బాగల్పుర్ (Vaishali, Patna, Buxar, Bhojpur, Saran, Vaishali and Bagalpur districts) జిల్లాల్లోని పాలు ఇచ్చే తల్లుల్లో (Mother Milk) ఈ ‘ఆర్సెనిక్’ (Arsenic)అధికంగా కనిపించింది. మరి ముఖ్యంగా బక్సర్ (Buxar)జిల్లాలో ఈ ఆర్సెనిక్ (Arsenic) ప్రభావం అధికంగా ఉంది. ఈ జిల్లాలోని తల్లి లీటరు పాలల్లో సుమారు 495.2 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
Also read : Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష
కాగా..బిడ్డలు పుట్టిన క్షణం నుంచి తల్లిపాలు కనీసం ఆరు నెలలు వచ్చే వరకూ తాగించాలి. అలా తల్లిపాలే శిశువు ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే ఇలా అరెన్సిక్ అధికంగా ఉన్న తల్లిపాలు తాగిన శిశువుకి ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శరీరంలో అరెన్సిక్ స్థాయి పెరిగితే.. క్యాన్సర్ (cancer)వ్యాధి బారిన పడే ఆవకాశం అధికం. ఇక కాలేయం, కిడ్నీ, గుండె, చర్మ వ్యాధి (liver, kidney, heart and skin diseases)వంటి అనేక ఇతర సమస్యలకు గురవుతారు.లీటరు తల్లిపాలలో 0.2 నుంచి 0.6 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉంటే శిశువు తాగటానికి ఆమోదం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే. బక్సర్ జిల్లాసహా ఆరు జిల్లాలో భారీగా ఆర్సెనిక్ కనిపించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సెనిక్ అంటే ఏమిటంటే..?
ఆర్సెనిక్ .. సల్ఫర్ లేదా ఇతర లోహాల కలియికతో ఏర్పడే ఉపధాతువు లేదా ఉప ఉత్పత్తి (by-product) మైనింగ్, గాజు తయారీ, సెమీ కండక్టర్ అనేక రసాయనాల తయారీలో అరెన్సిక్ ను ఉపయోగిస్తారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటి వరకూ ఈ ఆర్సెనిక్ బారిన పడినవారికి చికిత్స లేకపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వారి బిడ్డలు పాలు తాగితేవారికి కూడా పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితికి చికిత్స లేదు.. నివారణే ముఖ్యం అంటున్నారు పరిశోధకులు. పిల్లలు ఈ ఆర్సెనిక్ బారిన పడకుండా ఉండడం కోసం డాక్టర్లు, పోషకాహార నిపుణులు కొన్ని నివారణ సూచనలు చెబుతున్నారు. ముఖ్యంగా అపరిశుభ్రమైన నీటిని అస్సలు తాగవద్దని..నీటిని పరిశుభ్రం చేసుకుని తాగాలని సూచిస్తున్నారు. నీటిని ఆర్ఓ పద్ధతిలో శుభ్రం చేసుకోవాలని.. లేదంటే.. నీటి శుభ్రంగా వేడి చేసుకుని.. ఆ నీటిని శుభ్రమైన క్లాత్ తో వడకట్టి తాగాలని సూచిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆర్సెనిక్ శాతాలు ఎలా పెరిగాయంటే… గంగా నది జలాల్లో ఆర్సెనిక్ పాళ్లు పెరిగి సమీప జిల్లాల్లోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వాదనలు వస్తున్నాయి. దీనికి కారణం రసాయన ఎరువులు వాడటం, బొగ్గు మండించడం, బొగ్గు లీచింగ్ ప్రక్రియల్లో విడుదలయ్యే ఆర్సెనిక్ నీటిలో కలవటంతో ఆ నీరు ఉపయోగిస్తే ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.ముఖ్యంగా పారిశ్రామిక, మున్సిపల్ వ్యర్థాలు గంగా నదిలోని నీటిలో కలవడం మూలంగా ఆర్సెనిక్ పరిమాణం పెరిగిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీహార్ లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం ఆర్సెనిక్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అవి గంగా పరివాహక రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ పాళ్లు పెరిగాయని పరిశోధకుల వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే..భవిష్యత్ తరాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.