Komatireddy Venkat Reddy Letter Sonia Gandhi : సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ..సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీతో మునుగోడుపై సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించారని వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు.

Komatireddy Venkat Reddy Letter Sonia Gandhi
Komatireddy Venkat Reddy Letter Sonia Gandhi : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. ప్రియాంక గాంధీతో మునుగోడుపై సమావేశానికి హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించారని వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారంటూ వివరణ ఇచ్చారు. చండూరులో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాల ప్రస్తావించారు. తన కుటుంబంపై చేసిన కామెంట్స్ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోలేనంటూ వివరణ ఇచ్చారు.
మునుగోడుపై కీలక సమావేశం జరుగుతుంటే.. ఆ భేటీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. రేవంత్‌రెడ్డి మొహం చూడబోనని ఇటీవల కోమటిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుత భేటీకి రేవంత్‌రెడ్డి రావడంతో.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందులో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఢిల్లీ నుంచి హైదరబాద్ బయల్దేరారు. అటు మునుగోడు ఉపఎన్నికపై ప్రియాంకగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది.
కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కి గౌడ్, జీవన్‌రెడ్డితో పాటు శ్రీధర్‌బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికపైనే అధిష్టానం చర్చ జరుపుతుంటే.. ఆ మీటింగ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉపఎన్నిక హడావుడి మొదలైనప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు వైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు.