ప్రేమించి పెళ్లాడిన రెండు నెలలకే భార్య చేతులు నరికేసిన భర్త

Mp Man Suspects Wifes Character Chops Off Her Hands (2)
Mp Man Suspects Wifes Character Chops Off Her Hands (2)
husband whose wife cut off his hands : ప్రేమించానన్నాడు. నువ్వు లేకపోతే జీవితమే లేదన్నాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నాడు. ఒకసారి నా చేయి పట్టుకుని నడు..జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుని..నీ చేతులు కందిపోకుండా చూసుకుంటానని బాసలు చేశాడు. అలా అతని ప్రేమను నమ్మి ఏడు అడుగులు అతని చేయి పట్టుకుని నడిచింది. అంతే..పెళ్లి అయ్యింది. భార్యమీద ప్రేమ కాస్తా అనుమానానికి దారి తీసింది.
ఒక్కసారి నా చేయి పట్టుకుంటే జీవితాంతం నిన్ను విడిచిపెట్టను..నీ చేతులు విడిచిపెట్టను అని బాసలు చేసిన ఆ నోటితోనే..నమ్మి వచ్చి చేయి పట్టుకున్న భార్య చేతులను నరికిపారేశాడా భర్త..అనుమానం పెనుభూతమై..కసాయిగా మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేతులు నరికేసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్యను పెళ్లి జరిగిన పదిహేను రోజుల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండు నెలలకే భార్య రెండు చేతులు నరికేశాడో అనుమానపు భర్త.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో రణ్‌ధీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న 15 రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం అంతకంతకూ పెరిగింది. ఆమె ఏం చేసినా అనుమానంచూడటం..అనుమానంగా మాట్లాడటం..మాటలతో హింసించటం మొదలుపెట్టాడు. అలా గత సోమవారం ( మార్చి 22,2021) కట్టెలు తీసుకువద్దాం అని భార్యతో చెప్పి కూడా తీసుకెళ్లాడు. భర్తపై ఏమాత్రం అనుమానం రాని ఆమె కూడా వెళ్లింది.
అలా ఆమెను దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో రణ్‌ధీర్ కట్లెలు కొట్టే గొడ్డలితో తన భార్య చేతులను నరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత బాధితురాలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లు ఆమెకు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఆమె చేతులను తిరిగి మామూలు స్ధితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే తమకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో బాధితురాలి కన్నవారు ఈ ఘటనపై ఏరకంగాను స్పందించలేదు. మాకు సంబంధం లేదంటున్నారు. కానీ బాధితురాలి మామ మాత్రం కోడలిని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని నమ్మి వచ్చిన భార్యపై ఇంత ఘాతుకానికి పాల్పడిన కొడుకుమీద ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడు. కొడుకు ఇంటికి వస్తే పోలీసులకు పట్టిస్తానంటున్నాడు.
No trending news found.