కులాంతర వివాహానికి శిక్ష : భర్తను భుజాలపై మోసుకెళ్లి

భారతదేశంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒకనొక దశలో హత్యలకు కూడా తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందని శిక్ష విధించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని..ఆదేశించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాలోని భోపాల్‌కు 340 కి.మీటర్ల దూరంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దేవిఘర్‌లో ఓ మహిళ తమ కులానికి చెందని వ్యక్తితో వివాహం చేసుకుందని అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి శిక్ష విధించారు. భర్తను భుజాలపై మోసుకెళ్లాలని ఆదేశించారు. దీనితో ఆమె చేసేది ఏమి లేక భర్తను మోసుకెళ్లింది. నడవడానికి ఇబ్బంది పడుతున్నా వారు కనికరించలేదు. పైపెచ్చు డ్యాన్సులు ఆడారు. కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించాల్సి వచ్చింది. కేసును రిజిష్టర్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు..మరికొంతమంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
#WATCH Madhya Pradesh: Villagers force a woman to carry her husband on her shoulders as a punishment in Devigarh, Jhabua allegedly for marrying a man from a different caste. (12.4.19) pic.twitter.com/aNUKG4qX7p
— ANI (@ANI) April 13, 2019