Mukesh Ambani Car: అంబానీ రెగ్యూలర్‌గా వాడే కార్ రేట్ ఎంతో తెలుసా..

ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత ధనిక వ్యక్తి ల్యావిష్ లైఫ్ స్టైల్ గురించి ఏం విన్నా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో హైప్రొఫైల్ ఉన్న అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ క్యాటగిరీ ..

Mukesh Ambani Car: అంబానీ రెగ్యూలర్‌గా వాడే కార్ రేట్ ఎంతో తెలుసా..

Ambani Car

Updated On : April 13, 2021 / 1:26 PM IST

Mukesh Ambani Car: ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత ధనిక వ్యక్తి ల్యావిష్ లైఫ్ స్టైల్ గురించి ఏం విన్నా ఆశ్చర్యపోవాల్సిందే. ఇండియాలో హైప్రొఫైల్ ఉన్న అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ లేనిదే అడుగైనా బయటపెట్టలేదు. కానీ, అతను మాత్రం సొంత కారులోనే ప్రయాణిస్తారు. మచ్చుకైనా దాని ధరను ఊహించారా.. అక్షరాలా రూ.10కోట్లు. Mercedes G63 AMG కాన్వాయ్ లోనే ప్రయాణిస్తారు.

Mercedes S600 Guard luxury sedanలో రోజూ ప్రయాణించే అంబానీ.. వెహికల్ ను రెడీ చేసింది బెంజ్. ఇదంతా అంబానీకి చెందిన అత్యంత ఖరీదైన ఇల్లు ఏంటిలా ముందు కనిపించింది. చూడటానికి పైకి అంత ఆర్భాటంగా కనిపించకపోయినా వెహికల్ సేఫ్టీకి మాత్రం ఏం తీసిపోదు.

బుల్లెట్ ప్రూఫ్ రెడీ చేయడం కోసం మెర్జిడెస్ బెంజ్ చాలా వర్క్ చేసింది. ప్రత్యేకించి అటువంటి మెటేరియల్ ను తట్టుకోవడానికి.. అండర్ బాడీని మరింత పటిష్ఠంగా రెడీ చేశారు. స్ప్లింటర్ ప్రొటెక్షన్ కోసం అద్దాల లోపలి భాగంలో పాలీకార్బొనేట్ ను వాడారు. ఇక కారు బాడీ మొత్తం రీఇన్‌ఫోర్స్‌డ్ స్టీల్ తో రెడీ అయినా.. బాడీ లోపల మాత్రం స్పెషల్ స్టీల్ వాడారు.

ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కారణంగా.. Mercedes-Maybach S600 వీఆర్10 లెవల్ ప్రొటెక్షన్ తో వచ్చింది. 2మీటర్ల దూరం నుంచి వచ్చి కాల్చినా తట్టుకుని నిలబడేంత స్టామినా ఉంది ఈ బాడీకి. ఇక 15కేజీల టీఎన్టీ బ్లాస్టింగ్ నైనా తట్టుకోగలదు.

ఈ S600 గార్డ్ బరువు దాదాపు 4.7టన్నులు ఉండగా.. అంతే స్థాయిలో ఇంజిన్ సామర్థ్యం, యాక్సిలేటర్, బ్రేక్స్ సిద్ధం చేశారు. గంటలకు 190కిలోమీటర్లకు మించని వేగంతో ఇందులో ప్రయాణించాలి. ఇక ఇది స్పీడ్ వంద అందుకోవాలంటే 7.9సెకన్లలో చేరుకోగలదు. ఈ కార్ 200కేజీల బరువును మోయగలదు.