ముంబై సిటీ బస్‌లో మంటలు

  • Published By: veegamteam ,Published On : May 3, 2019 / 08:31 AM IST
ముంబై సిటీ బస్‌లో మంటలు

Updated On : May 3, 2019 / 8:31 AM IST

ముంబై సిటీ బస్సులో మంటలు చెలరేగాయి. దిందోషి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్ నడిరోడ్డుపై అగ్నికి ఆహుతి అయిపోయింది. మే 03వ తేదీన ఈస్ట్ గోరెగామ్ నుంచి మున్వారా ప్రాంతానికి ఓ బస్సు వస్తోంది. మార్కెట్ ప్రాంతానికి చేరుకున్న తర్వాత బస్సులో పెద్ద శబ్దం వినిపించింది. 

అనంతరం మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణీకులు తక్కువ మంది ఉన్నారు. వారంతా బస్ దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎండల వేడికి మంటలు చెలరేగాయా ? లేక మరైదేనా కారణం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.