Mumbai Corona : కరోనా ప్రళయం..లాక్‌డౌన్‌ దిశగా ముంబై

రోజుకు 5వేల కేసుల సగటుతో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటిందంటే ముంబైలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు...

Mumbai Corona : కరోనా ప్రళయం..లాక్‌డౌన్‌ దిశగా ముంబై

Mumbai

Updated On : January 7, 2022 / 12:00 PM IST

Lockdown Mumbai : లాక్‌డౌన్‌ దిశగా ముంబై అడుగులేస్తోంది. కరోనా మహమ్మారి విసిరిన పంజాతో ముంబై విలవిలలాడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే…కరోనా ప్రళయాన్ని సృష్టిస్తోంది. కరోనా సెకండ్‌వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో నమోదైన కేసులను మించి కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 2022, జనవరి 06వ తేదీ గురువారం ఒక్కరోజే 20వేల కేసులతో ముంబైలో రికార్డు స్థాయి కేసులు నమోదయ్యాయి. కరోనా టెస్టు చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. 30శాతం పాజిటివిటీ రేటుతో కోవిడ్ హై అలర్ట్ కొనసాగుతోంది. దీంతో లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే. కరోనాపై రివ్యూ నిర్వహించనున్నారు. రోజుకు 20వేల కేసులు నమోదైతే లాక్‌డౌన్‌ పెడతామంటూ మేయర్‌ రెండు రోజుల క్రితమే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిదే. ఆ రోజు కేసుల సంఖ్య 10 వేలుగా రికార్డయింది. మేయర్‌ వ్యాఖ్యలు చేసి రెండంటే రెండు రోజులే గడిచాయి. రోజుకు 5వేల కేసుల సగటుతో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 20వేలు దాటిందంటే ముంబైలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Read More : Corona Cases : భారత్‌లో కరోనా సునామీ.. ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్ కేసులు

మరోవైపు.. కొవిడ్‌ కారణంగా ముంబైలోని ఆసుపత్రుల్లో చేరికలూ పెరుగుతున్నాయి. అటు మహారాష్ట్ర మొత్తం కలిపి రికార్డువుతున్న కరోనా కేసుల్లో సగంకంటే ఎక్కువ కేసులు ఒక్క ముంబైలోనే రికార్డవుతున్నాయి. వార్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసినా.. కర్ఫ్యూలు విధించినా ఏ మాత్రం కేసుల స్పీడ్ తగ్గడంలేదు. అసలు కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిన ముంబై మోడల్‌ ఒమిక్రాన్‌ దెబ్బకు పని చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కరోనా కేసుల కంట్రోల్‌తో ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి ముంబై అధికారులు అభినందనలు అందుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడంలేదు.

Read More : Omicron Variant: ఒమిక్రాన్ ప్రాణాంతకమే…లైట్ తీసుకోవద్దు – WHO

ఇదిలా ఉంటే…కరోనా సునామీ భారత్‌పై విరుచుకుపడింది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గురువారం ఒక్కరోజే భారత్‌లో లక్షా 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 214 రోజుల తర్వాత భారత్‌లో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గతేడాది జూన్ తర్వాత ఒక్కరోజే లక్ష కేసులు రికార్డవడం ఇదే తొలిసారి. 8 రోజుల్లోనే రోజువారీ కేసుల సంఖ్య 10 వేల నుంచి లక్షకు చేరింది. సెకండ్‌వేవ్‌లో 10 వేల నుంచి లక్ష రోజువారీ కేసులకు 47 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు కేవలం 8 రోజుల్లోనే కేసుల సంఖ్య ఇంతలా పెరిగిందంటే దేశంపై ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉందో క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. సెకండ్‌వేవ్‌ కంటే 5రెట్ల ఎక్కువ వేగంతో కేసుల రికార్డవతుండడం ఆందోళన కలిగిస్తోంది.